Katrina Kaif and Vicky Kaushal wedding dates: కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ జంట పెళ్లి చేసుకుని ఒక ఇంటి వారు కాకముందే జంటగా లీగల్ ట్రబుల్స్‌లో పడ్డారు. ఈ నెల 7, 8, 9వ తేదీల్లో మూడు రోజుల పాటు వీళ్ల పెళ్లి వేడుక జరగనున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని సవాయి మాదాపూర్ జిల్లాలో ఉన్న సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బడ్వాడ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌ల పెళ్లి వేడుకకు వేదిక కానుంది. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి వేడుక నేపథ్యంలో డిసెంబర్ 6వ తేదీ నుంచి 12 వ తేదీ వరకు అక్కడే ఉన్న చౌత్ మాతా టెంపుల్‌కి వెళ్లే రహదారిని అధికారులు మూసేశారు.
అయితే, చౌత్ మాతా మందిరానికి (Chauth Mata temple) వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలిగేలా రహదారికి ఎలా మూసేస్తారని ప్రశ్నిస్తూ నేత్రాబింద్ సింగ్ అనే న్యాయవాది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటికి ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, పెళ్లి మండపం అయిన సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ (Six Senses Fort Barwara) వేదిక మేనేజర్‌తో పాటు ఆ జిల్లా కలెక్టర్‌ను రెస్పాండెంట్స్‌గా చేర్చారు. అంతేకాకుండా భక్తులకు ఇబ్బంది కలగకుండా రహదారిని తిరిగి తెరవాల్సిందిగా సదరు న్యాయవాది తన ఫిర్యాదులో విజ్ఞప్తిచేశారు.
Also read : Pushpa trailer: Allu Arjun స్టామినా ఏంటో చెప్పేలా పుష్ప ట్రైలర్.. తగ్గేదేలె
బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ అవుతున్న కత్రినా, విక్కీ కౌశల్‌తో పాటు జిల్లా కలెక్టర్‌పై సైతం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారం ప్రస్తుతం చర్చనియాంశమైంది. దీంతో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి (Katrina Kaif and Vicky Kaushal wedding dates) మరొక్కసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
Also read : Unstoppable latest episode: విలన్‌గా చేయడానికి నేను రెడీ.. బట్ వన్ కండిషన్ అంటున్న NBK
Also read : RRR Ramcharan Poster: రోరింగ్ రాంచరణ్... ఆర్ఆర్ఆర్ నుంచి అదిరిపోయిన కొత్త పోస్టర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook