Kobali Web Series Success Meet: ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రవి ప్రకాష్, రాకీ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ కోబలి. తరుణ్ రోహిత్, శ్రీతేజ్, శ్యామల, యోగి ఖత్రి, శ్రీ పవన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నింబస్ ఫిలిమ్స్, యు1 ప్రొడక్షన్స్, టి.ఎస్.ఆర్ మూవీ మేకర్స్ సంస్థలపై జ్యోతి మెగావత్ రాథోడ్, రాజశేఖర్ రెడ్డి కామిరెడ్డి, తిరుపతి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 4వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో 7 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్‌కు అన్ని రాష్ట్రాల ప్రజల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. హాట్‌స్టార్‌లో నెంబర్ వన్ ప్లేస్‌లో ట్రెండ్‌లో అవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా రవి ప్రకాష్ మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు అయిందని.. కొత్తగా ఏదో ఒకటి చేయాలి అనే నమ్మకంతో 'కోబలి' మొదలుపెట్టానని చెప్పారు. ఒక కాఫీ షాప్‌లో ఈ స్టోరీ విన్నానని.. వెంటనే నచ్చిందన్నారు. అందరూ కొత్త ముఖాలే అయినా.. హాట్‌స్టార్ నమ్మకం పెట్టిందన్నారు. ప్రేక్షకులు ఆదరించి.. ఇంత పెద్ద విజయాన్ని అందించారు. నిజాయితీగా పనిచేస్తే.. మంచి ఫలితం తప్పకుండా వస్తుందని తమ కోబలి టీమ్ నిరూపించిందన్నారు. దర్శకుడు రేవంత్ నమ్మకం కూడా నిజమైందని.. ప్రొడ్యూసర్స్ జ్యోతి, రాజశేఖర్ రెడ్డి కూడా ఈ కథని ఎంతో నమ్మారని చెప్పారు
రాకీ సింగ్ మాట్లాడుతూ.. 'కోబలి'ని ఇంతలా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఇందులో నటీనటులను బట్టి అమ్ముడయ్యే కంటెంట్ కాదని.. అయినా ఆడియన్స్ ఆదరించారని చెప్పారు. కంటెంట్ తప్పకుడా చూస్తామని ప్రేక్షకులు నిరూపించారని అన్నారు. సీజన్ 2లో అసలైన కథ అక్కడ మొదలవుతుందని తెలిపారు. అనంతరం ప్రొడ్యూసర్ జ్యోతి మాట్లాడుతూ.. కోబలి వెబ్‌సిరీస్‌ను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
సీనియర్ హీరో వెంకట్ మాట్లాడుతూ.. ఇందులో అంతా కొత్తవాళ్లే నటించారని.. కానీ హాట్ స్టార్ సంస్థ తమను నమ్మిందని చెప్పారు. ప్రేక్షకులు ఆదరించడంతో 7 భాషల్లో మంచి విజయాన్ని అందుకుందన్నారు. స్టార్లు ఉంటే కంటెంట్‌ను ఆదరిస్తారనేది పాత మాట అని.. కంటెంట్ బాగుంటే కొత్త పాత తేడా లేకుండా ప్రేక్షకులు హిట్ అందిస్తున్నారని అన్నారు. నిర్మాతలు రాజశేఖర్ రెడ్డి, తిరుపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తాము ఊహించిన దానికంటే కోబలి ఎక్కువ సక్సెస్ అయిందన్నారు. అన్ని రాష్ట్రాల్లో హిట్ టాక్‌తో దూసుకుపోతుందన్నారు. పార్ట్-2 కి అంతకుమించి ఉంటుందన్నారు.
Also Read: First Bird Flu Case: మనుషులకు వ్యాపించిన బర్డ్ ఫ్లూ, ఏలూరులో తొలి కేసు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.