Star Music director divorce: తమిళ మ్యూజిక్ డైరెక్టర్ డి ఇమ్మాన్ షాకింగ్ విషయం వెల్లడించారు. తన భార్య మోనికా రిచర్డ్‌తో విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. 'నవంబర్ 2020 నాటికి పరస్పర అంగీకారంతో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నాను. ఇకపై మేము భార్యాభర్తలం కాదు.' అని ఇన్స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు. విడాకులు తీసుకున్న దాదాపు ఏడాది కాలానికి ఇమ్మాన్ (D Imman) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం గమనార్హం.
ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన శ్రేయోభిలాషులు, సంగీత ప్రియులకు తాను కృతజ్ఞుడినని ఇమ్మాన్ పేర్కొన్నారు. అదే సమయంలో వారికో విజ్ఞప్తి చేశారు. శ్రేయోలాభిషులు, సంగీత ప్రియులు, మీడియా తమకు ప్రైవసీ ఇవ్వాలని.. జీవితంలో ముందుకు సాగేందుకు సహకరించాలని కోరారు. ఇన్నాళ్లు తన పట్ల చూపించిన ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు చెబుతున్నట్లు తెలిపారు.
ఇమ్మాన్-మోనికా రిచర్డ్‌లు ఏప్రిల్, 2008లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు వెరోనికా, బ్లెస్సికా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు విడిపోవడానికి గల కారణాలేంటనేది తెలియరాలేదు. ఇటీవల విడుదలైన రజనీకాంత్ 'పెద్దన్న' (Rajinikanth Peddanna Movie) సినిమాతో పాటు ఇప్పటివరకూ 100 పైచిలుకు చిత్రాలకు ఇమ్మాన్ సంగీత దర్శకత్వం వహించారు. 2002లో తమిళన్ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఇమ్మాన్... కుంకి, జీవా, రజనీ మురుగన్, కదయ్ కుట్టి సింగం వంటి హిట్ సినిమాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. అజిత్ విశ్వాసం సినిమా మ్యూజిక్‌కి గాను 2019లో ఇమ్మాన్‌కు జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు లభించింది.
Also Read: Jasprit Bumrah: బుమ్రాతో వెకేషన్.. సంజన గణేశన్ హాట్‌నెస్‌కు ఫాన్స్ ఫిదా!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook