/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

KT Rama Rao Legal Notice: సినీ నటులు అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల అంశంపై తనపై తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని.. హీరోయిన్ల విడాకులకు కారకుడిగా పేర్కొన్న సురేఖపై న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సురేఖకు లీగల్‌ నోటీసులు పంపించారు. ఈ సందర్భంగా సురేఖ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్‌ ఖండించారు.

Also Read: Actress Samantha: రాజకీయాల్లోకి నన్ను లాగవద్దు.. కొండా సురేఖకు హీరోయిన్‌ సమంత స్ట్రాంగ్‌ వార్నింగ్‌

తనపై చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ బుధవారం మంత్రి సురేఖకు లీగల్‌ నోటీసు పంపించారు. ఈ సందర్భంగా నోటీసుల్లో సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మంత్రిగా పనిచేస్తున్న కాలంలో ఫోన్ టాపింగ్ చేశారంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలతో పాటు, నాగచైతన్య సమంత విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అంటూ కొన్ని దుర్వేశపూర్వక వ్యాఖ్యలు చేశారు. కేవలం తన గౌరవానికి ఈ ఇమేజ్‌కు భంగం కలిగించాలనే లక్ష్యంగానే సమంత- నాగచైతన్య పేర్లను తీసుకుంటూ కొండా సురేఖ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు' అని లీగల్ నోటీసులో కేటీఆర్ పేర్కొన్నారు.

Also Read: Akkineni Nagarjuna: కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున ఆగ్రహం.. సారీ చెప్పాలని డిమాండ్‌

'ఒక మహిళ అయి ఉండి ఇంకొక మహిళ పేరును, సినిమా నటుల పేరును వాడుకొని వారి వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడడం దురదృష్టకరం. అసలు తనకు సంబంధమే లేని ఫోన్ టాపింగ్, ఇతర అంశాలపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యపూరితం' అని కేటీఆర్ తెలిపారు. ఒక మంత్రిగా కొండా సురేఖ తన మంత్రి హోదాను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కొండా సురేఖ చేసిన అసత్యపూరిత వ్యాఖ్యలు, దురుద్దేశపూరిత మాటలు మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచురితమయ్యాయి' కేటీఆర్ తెలిపారు.

'ఎలాంటి సాక్ష్యాధారాలు చూపించకుండా అడ్డగోలుగా మాట్లాడిన కొండా సురేఖ ఒక మంత్రి అని, ఆమె చేసిన వ్యాఖ్యలను సాధారణ ప్రజలు నిజాలుగా భ్రమపడే అవకాశం ఉంది. ఒక మంత్రిగా తన సహచర అసెంబ్లీ సభ్యుడు అని సోయి కూడా లేకుండా కొండా సురేఖ మాట్లాడడం ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలో ఇవే అడ్డగోలు మాటలు మాట్లాడిన కొండా సురేఖకు ఈ సంవత్సరం నాలుగో నెలలో నోటీసులు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి అవాంఛనీయ వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖకు భారత ఎన్నికల సంఘం గట్టి హెచ్చరిక చేసిందని అయినా ఇలాంటి దురుద్దేశపూర్వక ఒక వ్యాఖ్యలను కొనసాగిస్తున్నారన్నారు. కొండా సురేఖ ప్రణాళికబద్ధంగా కావాలనే పదేపదే అవే అబద్దాలను తన వ్యక్తిత్వాన్ని తగ్గించడం కోసం, నష్టపరచడం కోసం చేస్తుంది' అని లీగల్‌ నోటీసుల్లో కేటీఆర్‌ తెలిపారు.

'ఆ వ్యాఖ్యలను కొండా సురేఖ వెంటనే వెనక్కి తీసుకోవాలి. దురుద్దేశపూర్వకంగా అబద్దాలు, అసత్యాలు మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలి' అని కేటీఆర్‌ లీగల్‌ నోటీసుల్లో డిమాండ్‌ చేశారు . భవిష్యత్తులోనూ ఇలాంటి దురుద్దేశపూర్వక, చిల్లర మాటలు మాట్లాడవద్దని హితవు పలికారు. 24 గంటల్లోగా కొండా సురేఖ క్షమాపణ చెప్పకుంటే చట్ట ప్రకారం పరువు నష్టం దావాను వేయడంతో పాటు క్రిమినల్ కేసులను కూడా వేస్తానని హెచ్చరించారు. 24 గంటల్లోగా కొండా సురేఖ క్షమాపణ చెప్పకుంటే చట్ట ప్రకారం పరువు నష్టం దావాను వేయడంతో పాటు క్రిమినల్ కేసులను కూడా వేస్తానని కేటీఆర్‌ హెచ్చరించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Section: 
English Title: 
KT Rama Rao Sends Legal Notice To Konda Surekha Comments Samantha Naga Chaitanya Divorce Rv
News Source: 
Home Title: 

KTR: క్షమాపణలు చెబుతారా? లేదా కోర్టుకు ఈడ్చాలా? కొండా సురేఖకు కేటీఆర్‌ వార్నింగ్‌

KTR: క్షమాపణలు చెబుతారా? లేదా కోర్టుకు ఈడ్చాలా? కొండా సురేఖకు కేటీఆర్‌ వార్నింగ్‌
Caption: 
KTR Legal Notice
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
KTR: క్షమాపణలు చెబుతారా? లేదా కోర్టుకు ఈడ్చాలా? కొండా సురేఖకు కేటీఆర్‌ వార్నింగ్‌
Ravi Kumar Sargam
Publish Later: 
No
Publish At: 
Wednesday, October 2, 2024 - 21:04
Created By: 
Ravi Kumar Sargam
Updated By: 
Ravi Kumar Sargam
Published By: 
Ravi Kumar Sargam
Request Count: 
20
Is Breaking News: 
No
Word Count: 
379