Mohan babu Sesnational Comments on Police Officials:విలక్షణ నటుడు డైలాగ్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ముక్కుసూటిగా మాట్లాడుతూ తన మనసులో ఏది ఉన్నా మొహం మీద చెప్పేస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ ఉంటారు. తాజాగా మోహన్ బాబు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈసారి పోలీసు అధికారులను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి.
అసలు విషయం ఏమిటంటే విశాల్ హీరోగా నటించిన లాఠీ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో రెండు చోట్ల ఘనంగా జరిగింది. అందులో ఒకచోట ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిధిగా హాజరైన మోహన్ బాబు సినిమా టైటిల్ లాఠీ కాబట్టి పోలీసుల గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు అంటే తనకు ఎంతో గౌరవం అని వాళ్ళు కూడా మనలాంటి సామాన్యుల నుంచి ఆ ఉద్యోగాలలోకి వెళ్లి చేరిన వాళ్ళని చెప్పుకొచ్చారు.
మనం పోలీసులకు కచ్చితంగా గౌరవం ఇవ్వాల్సిందే అని మోహన్ బాబు పేర్కొన్నారు. సమాజంలో చోటు చేసుకునే ఏ సంఘటన గురించైనా ఏ నిజమైనా ముందుగా పోలీసులకు అందులోనూ ముందుగా కానిస్టేబుల్స్ కే తెలుస్తుందని ఆయన కామెంట్ చేశారు. అయితే ఇక్కడ నాకు బాధ అనిపించే విషయం ఏమిటంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ గవర్నమెంట్ కు అనుకూలంగా పని చేయాల్సిన బాధ్యత కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ ల పై ఉంటుందని కింది స్థాయి ఉద్యోగులు తమ పై అధికారుల దగ్గరకు వెళ్లి నేను నిజం చూశాను కానీ నువ్వు నన్ను తప్పు చెప్పమంటున్నావ్ అని అంటే అతడిని ఏకంగా ఉద్యోగాల నుంచే తీసేస్తున్నారని అన్నారు.
ఎక్కువ శాతం అధికారంలో ఎవరు ఉంటే ఆ గవర్నమెంట్ గా తొత్తులుగా పనిచేసే పోలీసు అధికారులు ఉంటున్నారని ఆయన అన్నారు. ఇది నేను ఓపెన్ గా చెబుతున్నాను కానీ నేను ఎప్పుడూ పోలీస్ డిపార్ట్మెంట్ కి గౌరవం ఇస్తానని ఆయన పేర్కొన్నారు, పోలీస్ ఉన్నతాధికారులు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారి కోసమే పని చేస్తున్నారని పేర్కొన్న మోహన్ బాబు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఇదే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు కానీ ఒక సెలబ్రిటీ నోటివెంట ఈ కామెంట్స్ రావడంతో అందరిలోనూ చర్చ నెలకొంది.
Also Read: Bigg Boss Telugu: ‘స్టార్ మా’తో ముగిసిన బిగ్ బాస్ అగ్రిమెంట్.. ఈసారి వేరే ఛానల్లో
Also Read: Kiccha Sudeep: చెప్పుతో కొడతారా? పునీత్ ఉండి ఉంటే ఆయన సమర్థిస్తారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.