అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్‌పై స్పందించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్

జూన్‌ 24న సమావేశం కానున్న మా అసోసియేషన్ 

Last Updated : Jun 16, 2018, 05:35 PM IST
అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్‌పై స్పందించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్

అమెరికాలో టాలీవుడ్‌ నటీమణులతో వ్యభిచారం చేయిస్తున్నారనే ఆరోపణల కింద ఇద్దరు తెలుగు దంపతులను అక్కడి దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేయడంతో వెలుగు చూసిన చికాగో సెక్స్‌ రాకెట్‌ టాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. అక్కడ పోలీసులు గుర్తించిన ఐదుగురు బాధితుల్లో ఇద్దరు టాప్‌ హీరోయిన్స్ ఉన్నట్టు ఓ ప్రచారం జరుగుతోంది. ఆ ఇద్దరూ ఎవరు, ఏంటనే వివరాలు ప్రస్తుతం గోప్యంగానే ఉన్నప్పటికీ.. వాళ్లిద్దరూ దక్షిణాదిన సుపరిచితులే అనే టాక్ వినిపిస్తోంది. అమెరికా పోలీసులు అరెస్ట్ చేసిన కిషన్‌ మోదుగుముడి అలియాస్‌ రాజు అలియాస్‌ శ్రీరాజు, అతని భార్య చంద్రలు టాలీవుడ్‌కు చెందిన నటీమణులను వివిధ వేడుకలు, కార్యక్రమాలు, సమావేశాలకు అతిథులుగా టూరిస్ట్ వీసాలపై అమెరికాకు రావాల్సిందిగా ఆహ్వానించి, అక్కడ వారి చేత వ్యభిచారం చేయిస్తున్నారనే అభియోగాల కింద పోలీసులు ఈ కేసు నమోదుచేశారు. దీంతో ఇప్పటికే డ్రగ్స్ కేసుతో తీవ్ర అభాసుపాలైన టాలీవుడ్ సినీ పరిశ్రమ.. ఈ సెక్స్ రాకెట్‌తో మరోసారి ఆత్మరక్షణలో పడింది. 

అమెరికాలో వెలుగు చూసిన సెక్స్ రాకెట్‌తో టాలీవుడ్ పేరు అప్రతిష్టపాలవుతోందని భావించిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్.. జూన్‌ 24న సమావేశం నిర్వహించి ఈ వివాదంపై చర్చించనున్నట్టు ప్రకటించింది. షికాగో సెక్స్ రాకెట్ వివాదంపై మా అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా స్పందిస్తూ.. ఇలాంటి వ్యవహారాల్లో చిక్కుకుని ఇబ్బందులు పడొద్దని మొదటి నుంచీ ఆర్టిస్టులను హెచ్చరిస్తూ వస్తున్నట్టు శివాజీ రాజా స్పష్టంచేశారు. కిషన్‌ మోదుగుముడి వ్యవహార శైలిపై మాకు ఓ అవగాహన ఉంది. అతను ఓ రెండు సినిమాలకు కో ప్రోడ్యూసర్‌, ప్రొడక్షన్‌ మెనేజర్‌గా చేసినట్లున్నాడు అని అన్నారు. 

గతంలో తాను మా అసోసియేషన్‌కి ఉపాధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో ఇలాంటి వ్యవహారాలను గుర్తించడం జరిగింది. ముఖ్యంగా అమెరికా, సింగపూర్‌, దుబాయ్‌, ఆస్ట్రేలియాలోని కార్యక్రమాలకు వెళ్లే ఆర్టిస్టులలో చాలా మందికి అక్కడ జరిగే మోసాలు, వీసా సమస్యల గురించి అంతగా అవగాహన లేనందున మొదటి నుంచీ వారిని జాగ్రత్తగా ఉండాల్సిందిగా హెచ్చరించడం జరుగుతూనే ఉంది. అందుకే ఇకపై విదేశాల నుంచి ఏమైనా ఆహ్వానాలు అందినట్టయితే, ఆయా కార్యక్రమాల వివరాలను మాకు అందజేస్తే.. ఆ తర్వాత సదరు కార్యక్రమాల నిర్వాహకులు, ఆహ్వానించిన వారితో మా బృందం మాట్లాడి ఆ కార్యక్రమాల స్వరూపం ఎటువంటిదో ధృవీకరిస్తామని’ శివాజీరాజా వివరించారు.

 

Trending News