iBomma Movies: సినీ ప్రియులకు గుడ్‌న్యూస్, ఐ బొమ్మలో కొత్త సినిమాల సందడి

iBomma Movies: సినీ ప్రియులకు శుభవార్త్. పైసా ఖర్చు లేకుండా కొత్త సినిమాలు చూసేయొచ్చు. అవును మరి. ధర్డ్ పార్టీ వెబ్‌సైట్‌గా తెలుగు ప్రజలకు సుపరిచితమైన ఐ బొమ్మలో కొత్త సినిమాలు వచ్చేశాయి. అవేంటో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 18, 2024, 02:08 PM IST
iBomma Movies: సినీ ప్రియులకు గుడ్‌న్యూస్, ఐ బొమ్మలో కొత్త సినిమాల సందడి

iBomma Movies: ఇటీవలి కాలంలో థియేటర్‌కు వెళ్లి సినిమా చూడటం చాలా అరుదుగా మారింది. లెక్కలేనన్ని ఓటీటీలు అంతకుమించి ఐబొమ్మ వంటి వెబ్‌సైట్లు అందుబాటులో రావడంతో కొత్త సినిమాలు సైతం వచ్చింది వచ్చినట్టు చూసేస్తున్నారు. ఇప్పుడు ఐబొమ్మలో మరి కొన్ని కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. 

ధియేటర్‌కు వెళ్లి సినిమా చూడటం తగ్గిపోయింది. అంతకుమించి ఖర్చు కూడా ఎక్కువ కావడంతో ఓటీటీల్లో విడుదలయ్యేవరకూ వేచి చూస్తున్నారు. ఎందుకంటే అన్ని కొత్త సినిమాలు థియేటర్‌లో విడుదలైన నెలరోజులకే ఏదో ఒక ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. దీనికితోడు ఐ బొమ్మ వంటి ధర్డ్ పార్టీ వెబ్‌సైట్లు కొత్త సినిమాలను వచ్చింది వచ్చినట్టుగా విడుదల చేస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచితమైన వెబ్‌సైట్ ఇది. ఐ బొమ్మ అంటే తెలియనివాళ్లుండరు. ఓటీటీల కంటే వేగంగా సినిమాలు విడుదలవుతున్నాయి. 

అయితే ఐ బొమ్మలో విడుదలయ్యే సినిమాలు పూర్తిగా అనధికారికం. కొన్ని ప్రింట్లు బాగుంటే మరికొన్ని క్లారిటీగా ఉండవు. కానీ కొత్త సినిమాలు మాత్రం చాలా వేగంగా విడుదలవుతుంటాయి. ఇప్పుడు మరి కొన్ని కొత్త సినిమాలు ఐ బొమ్మలో విడుదలయ్యాయి. సంక్రాంతికి విడుదలైన నాగార్జున సినిమా నా సామిరంగ ఐ బొమ్మలో విడుదలైంది. మరోవైపు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కేరళ స్టోరీస్ సినిమా కూడా ఐ బొమ్మలో విడుదలైంది.  ఇక ప్రియమణి నటించిన భామాకలాపం 2 కూడా ఐ బొమ్మలో విడుదలైంది. 

ఇవి కాకుండా వాలెంటైన్స్ నైట్, గుంటూరు కారం, కెప్టెన్ మిల్లర్, బబుల్ గమ్ సినిమాలు కూడా ఐ బొమ్మలో వీక్షించవచ్చు.

Also read: Aadhaar Card: ఆధార్ కార్డు పోగొట్టుకున్నారా, చాలా సులభంగా ఇ ఆధార్ ఇలా పొందవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News