Oohalu Gusagusalade - Gundamma Katha Mahasangamam: సాధారణంగా క్రాస్ ఓవర్స్ అనేవి ఎక్కువగా సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. ఒక సినిమాలో జరిగిన విశేషాలను మరో సినిమాలో చూపిస్తే అదో పెద్ద వింతలాగా ఉండేది. ఇప్పుడు అలాంటివి సినిమాల్లో కూడా చాలా కామన్ అయిపోయాయి. ఇప్పుడు అదే ట్రెండ్ సీరియల్స్ లోకి కూడా వచ్చేసింది. మరీ ముఖ్యంగా జీ తెలుగు మహా సంగమం పేరుతో ఒక ట్రెండ్ నడిపిస్తోంది. ఈ ఫార్మాట్లో మిగతా అందరిని వెనక్కి నెట్టి మరీ ముందు వరుసలో నిలుస్తూ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇటీవల ఇంటిగుట్టు అలాగే మిఠాయి కొట్టు చిట్టెమ్మ మహా సంగమం ఎపిసోడ్స్ తో ప్రేక్షకులను అల్లరించిన జీ తెలుగు ఇప్పుడు ఊహలు గుసగుసలాడే, గుండమ్మ కథ మహాసంగమానికి శ్రీకారం చుట్టింది. జూలై 13, 14 తేదీలలో మధ్యాహ్న ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ఈ మహా సంగమం ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ప్రసారం కాబోతున్నాయి. ఆ విషయానికి సంబంధించిన కథలోకి వస్తే ఊరిలోనే అమ్మవారు గత కొంతకాలంగా రక్తపు కన్నీరు కారుస్తూ ఉండడంతో ఊరి ప్రజలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి జాతర నిర్వహించాలనే నిర్ణయం తీసుకుంటారు.
ఇందులో భాగంగా గుండమ్మ కథ సీరియల్ కు సంబంధించిన మాణిక్యం, తన సోదరి వరుసైన ఊహలు గుసగుసలాడే సీరియల్ కి సంబంధించిన జయంతి అలాగే ఆ గుడి కట్టించిన వంశీయులు పూజలు నిర్వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఊరి ప్రజలు అమ్మవారికి నగలను అంటే నిలువు దోపిడీ అర్పించాల్సి ఉంటుంది. అయితే కొందరు ఈ పూజలు జరగకుండా పూజలు నిర్వహిస్తున్న వారిని అవమానించేలా ప్లాన్ చేస్తారు. కానీ ఈ ఇరు సీరియల్స్ లోని హీరో-హీరోయిన్ ఎలా వారి ప్రయత్నాలు తిప్పికొడతారనేది ఈ ఎపిసోడ్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రూపొందించారు.
ప్రసారమైన మొదటి రోజు నుంచి ఊహలు గుసగుసలాడే గుండమ్మ కథ సీరియల్స్ సమాజంలో జరుగుతున్న స్టీరియో టైప్స్ ని తిప్పికొడుతూ ప్రేక్షకులను, అభిమానాన్ని అతి తక్కువ సమయంలో చూరగొన్నాయి. ఇప్పుడు ఈ సీరియల్ కి సంబంధించిన ప్రధాన పాత్రలు ఒకే స్క్రీన్ లో కనిపించబోతూ ఉండడంతో జీతెలుగు రెట్టింపు వినోదాన్ని పంచబోతూ ఉంది.
Also Read: Kalyan Dev: విడాకుల వార్తల నేపథ్యంలో కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్.. దాని గురించేనా?
Also Read: Pooja Hegde: బికినీ ట్రీట్ ఇచ్చిన బుట్టబొమ్మ.. సముద్రం ఒడ్డున సొగసరి పూజా హొయలు!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook