Hema: రేవ్ పార్టీలో బిగ్ ట్విస్ట్.. నటి హేమ ఫోటోలు లీక్..!

Bangalore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ ఎంత చర్చలకు దారితీస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉదయం నుంచి అన్ని మీడియాలో.. ఈ పార్టీలో పట్టుబడిన తెలుగు నటుల గురించి ఎన్నో కథనాలు వస్తున్నాయి..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 20, 2024, 05:02 PM IST
Hema: రేవ్ పార్టీలో బిగ్ ట్విస్ట్.. నటి హేమ ఫోటోలు లీక్..!

Hema Rave Party Photo Leaked 
బెంగళూరు రేవ్ పార్టీ ఈరోజు ఉదయం నుంచి చాలా చర్చలకు దారితీస్తోంది. ఈ పార్టీలో ఎంతోమంది తెలుగు నటుల పేర్లు వినిపిస్తున్నాయి. బెంగళూరు శివారులో నిర్వహించిన ఓ రేవ్‌ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు, 18 సంవత్సరాలు కూడా నిందని కొంతమంది యువతి యువకులు.. పట్టుబడ్డారని వార్తలు వస్తున్నాయి. కాగా తెలుగు నటీనటుల్లో హేమ.. శ్రీకాంత్ పేరు ఎక్కువగా వినిపించడంతో.. తాజాగా దీనిపై నటి హేమ రియాక్ట్ అయినా సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి స్పందిస్తూ.. బెంగళూరులో నిర్వహించిన రేవ్‌ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఇందుకోసం ఓ ప్రత్యేక వీడియోను కూడా సోషల్ మీడియాలో ఉదయం రిలీజ్ చేశారు.

 

"నేను ఎక్కడకీ వెళ్లలేదు.. హైదరాబాద్‌లోనే నేను ఉన్నాను. ఇక్కడ ఓ ఫామ్‌హౌస్‌లో నేను ఎంజాయ్‌ చేస్తున్నాను.. చిల్ అవుతున్నాను. నాపై వస్తున్న వార్తలను దయచేసి నమ్మకండి. అది పూర్తిగా ఫేక్‌ న్యూస్‌. అక్కడ ఎవరు ఉన్నారో నాకు అయితే తెలియదు. దయచేసి మీడియాలో నాపై వచ్చే వార్తలను మాత్రం నమ్మకండి" అంటూ వీడియో రిలీజ్ చేసింది.

అయితే ఆమె ఈ వీడియో రిలీజ్ చేసిన కాసేపటికి.. బెంగళూరు పోలీసులు తాము హేమను అరెస్ట్ చేశామంటూ ఒక ఫోటో రిలీజ్ చేశారు. దీంతో రుజువుతో సహా హేమ రేవ్ పార్టీలో ఉంది అన్న విషయం బయటపడింది. మరో ఆసక్తికర విషయం ఏమిటి అంటే హేమ రిలీజ్ చేసిన వీడియో బైట్ లో ఉండే డ్రెస్.. పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలో ఉండే డ్రెస్ ఒకటే కావడం. 

దీంతో నిజంగానే హేమ బెంగళూరు పోలీసుల కస్టడీలో ఉందా? లేక పోలీసులు అదుపులోకి తీసుకుని ఆ తరువాత విడిచి పెట్టారా?  అనే విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకి దారితీస్తున్నాయి. మరి ఇప్పుడు పోలీసులు రుజువుతో సహా తాను రేవ్ పార్టీలో ఉందని ఫోటో రిలీజ్ చేయడంతో.. హేమ దీని గురించి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Also read: Iran President killed: ఇరాన్ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ సహా విదేశాంగ మంత్రి ఛాపర్ క్రాష్‌లో దుర్మరణం

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News