Pralaya Kaala Rudra look: విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్న ‘కన్నప్ప’ సినిమా గురించి సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
సినిమా ప్రమోషన్‌ను మేకర్స్ వేగవంతం చేశారు. ప్రతి సోమవారం కన్నప్ప సినిమాలోని ముఖ్య పాత్రలకు సంబంధించిన కొత్త అప్డేట్‌ను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్ లుక్‌ను విడుదల చేశారు. ‘ప్రళయ కాల రుద్రుడు’, ‘త్రికాల మార్గదర్శకుడు’, ‘శివాజ్ఞ పరిపాలకుడు’ అంటూ చిత్ర బృందం ప్రభాస్ పాత్రను పరిచయం చేసింది. ఈ లుక్‌లో ప్రభాస్ శివుడి రౌద్రరూపంలో దర్శనమిచ్చారు.
ప్రభాస్ రుద్ర రూపంలో దర్శనమిచ్చే ఈ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన వేషధారణ, ముఖ కవళికలు చూస్తుంటే దైవత్వం ఉట్టిపడేలా ఉన్నాయి. ఇప్పటికే అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతీ మాతగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ లుక్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ॐ The Powerful 'Rudra' ॐ
Unveiling Darling-Rebel Star 'Prabhas' as 'Rudra' 🔱#Kannappa🏹 #PrabhasAsRudra🔱 #HarHarMahadevॐ@iVishnuManchu @Mohanlal #Prabhas @akshaykumar @realsarathkumar #MukeshRishi @MsKajalAggarwal #PreityMukhundhan @arpitranka_30 #Aishwariyaa #Madhoo… pic.twitter.com/VoMjapotmQ
— Mohan Babu M (@themohanbabu) February 3, 2025
ఈ చిత్రంలో మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం వంటి అనుభవజ్ఞులైన నటీనటులు నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ భారీ అంచనాలను పెంచింది. అంతేకాదు, విష్ణు మంచు తన టీంతో కలిసి ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం చేయాలని నిర్ణయించుకున్నారు. సినిమా విడుదలకు ముందు పన్నెండు జ్యోతిర్లింగాలను సందర్శిస్తానని విష్ణు మంచు తెలిపారు.
కన్నప్ప చిత్రం గురించి రోజుకో ఆసక్తికరమైన అప్‌డేట్ వస్తుండటంతో సినిమా మీద అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ లుక్ సినిమాపై మరింత ఉత్కంఠను పెంచింది. ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా, ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
Also read: Sandeep Reddy Vanga: ఎంక్వైరీలో అలా తేలింది..అందుకే సాయి పల్లవిని రిజెక్ట్ చేశా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి