Prabhas Spirit Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయాడు. గతంలో ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేసే ప్రభాస్, ఇప్పుడు డిమాండ్ పెరగడంతో వరుసగా కొత్త ప్రాజెక్టులను ఒప్పుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం రాజా సాబ్, కల్కి 2898 ఎడి వంటి సినిమాలు చేస్తున్నాడు.
ఇప్పుడాయన మరో క్రేజీ ప్రాజెక్ట్ అయిన స్పిరిట్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కొడుకు ఈ చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నట్లు సమాచారం.
త్రివిక్రమ్ ఇప్పటి వరకు అనేక విజయవంతమైన చిత్రాలను అందించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తనయుడు కూడా సినిమాలపై ఆసక్తి చూపుతున్నాడట. ఇప్పటికే విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమాలో.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారని సమాచారం. ఇప్పుడు ప్రభాస్ స్పిరిట్ చిత్రంలో కూడా పని చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ప్రభాస్ వరుసగా చిత్రాలు పూర్తి చేసేందుకు పాటుపడుతున్నాడు. ఇటీవల విడుదలైన సలార్ ఘన విజయం సాధించగా, కల్కి 2898 ఎడి కూడా భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు రాజా సాబ్ షూటింగ్ దశలో ఉంది. స్పిరిట్ మూవీతో మరోసారి ప్రభాస్ తన నటనా ప్రతిభను చూపించేందుకు సిద్ధమవుతున్నాడు.
త్రివిక్రమ్ కొడుకు నిజంగానే స్పిరిట్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడా? లేదా అన్నదానిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ ఈ వార్త ఇప్పుడు సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
Also Read: Koneru Konappa: రేవంత్ రెడ్డికి ఊహించని దెబ్బ.. కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా
Also Read: KCR Meeting: గాయాల నుంచి కోలుకుని పుంజుకోవాలి.. గులాబీ శ్రేణులకు మాజీ సీఎం కేసీఆర్ పిలుపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.