Ram Mandir: అయోధ్యకు ప్రభాస్ 50 కోట్ల విరాళం…క్లారిటీ ఇచ్చిన టీమ్

Prabhas Donation to Ram Mandir: గత కొద్ది రోజులుగా అయోధ్యలో జనవరి 22న ప్రారంభమవుతున్న రామ మందిరానికి పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ రూ.50 కోట్లు విరాళం ఇచ్చారంటూ వార్తలు రాసాగాయి. అంతేకాకుండా ఆలయ ప్రారంభోత్సవం రోజు ఆహారపు ఖర్చు కూడా ప్రభాస్ పెట్టబోతున్నట్లు మరికొన్ని పుకార్లు షికార్లు చేశాయి. అసలు ఈ వార్తల్లో నిజముందా లేదా అనే విషయం ఒకసారి చూద్దాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2024, 07:10 PM IST
Ram Mandir: అయోధ్యకు ప్రభాస్ 50 కోట్ల విరాళం…క్లారిటీ ఇచ్చిన టీమ్

Ayodhya Ram Mandir: అయోధ్యలో జనవరి 22న రామ మందిరం ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రారంభోత్సవం కోసం భారతదేశంలోని వారందరూ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రామ మందిర ప్రారంభోత్సవానికి ఎంతోమంది ప్రముఖులను ఆహ్వానించారు. ఇందులో సినీ సెలబ్రెటీస్ కూడా ఉన్నారు. కాగా ఈ రామ మందిరానికి ప్రభాస్ రూ.50 కోట్లు ఇచ్చారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొత్తడం ప్రారంభించాయి. ఇటీవల ఏపీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆ రోజు ఆహార ఖర్చులను చూసుకోవడానికి ప్రభాస్ ముందుకు వచ్చారంటూ మాట్లాడారు. దీంతో ఈ వార్తలన్నీ నిజమే అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వాటిని షేర్ చేస్తూ వచ్చారు.

అయితే ఈ వార్తలు ఎంతవరకు నిజమనేది తెలియలేదు. అందుకు కారణం కూడా ఉంది. నిజానికి రామ మందిర ప్రారంభోత్సవానికి  ప్రభాస్‌కు ఇప్పటివరకు ఆహ్వానం అందలేదు. రజనీకాంత్, చిరంజీవి, రామ్ చరణ్, ధనుష్ లతో పాటు కొందరు సౌత్ సెలబ్రిటీలకు మాత్రం ఈ రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది. 

మరి రామ మందిర ప్రారంభోత్సవానికి అసలు ఆహ్వానమే అందుకోని ప్రభాస్ ఆహార ఖర్చులు పెట్టుకుంటానని హామీ ఇచ్చారంటూ ఎలా వార్తలు వస్తున్నాయి అని చాలామందిలో సందేహాలు మొదలయ్యాయి. ఇక ఫైనల్ గా ఈ వార్తల్లో వాస్తవమెంతో ప్రభాస్ టీమ్ మెంబర్లు క్లారిటీ ఇచ్చారు.

తాజాగా నేషనల్ మీడియా ఇదే విషయంపై ప్రభాస్ టీమ్ తో మాట్లాడగా.. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని వాళ్ళు స్పష్టం చేశారు. ఇదంతా ఫేక్ న్యూస్ అని నమ్మవద్దని క్లారిటీ ఇచ్చారు.

కాగా బాహుబలి తరువాత వరుస ప్లాపులతో సతమతమవుతున్న ప్రభాస్ కి సలార్ రూపంలో సూపర్ హిట్ దక్కింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర 700 కోట్లపైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం మారుతి డైరెక్షన్‌లో ది రాజా సాబ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ పార్ట్ 2, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్, మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్.

Also Read Rythu Bandhu and Loan Waiver: తెలంగాణ రైతులకు శుభవార్త.. ఒకేసారి రైతుబంధు, రుణమాఫీ

Also Read Addanki Dayakar: అద్దంకి దయాకర్‌కు మరోసారి హ్యాండిచ్చిన కాంగ్రెస్.. అసలేం జరిగిందంటే..?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News