Anushka Sharma Shirshasanam: అనుష్క శర్మ శీర్షాసనం.. నెటిజన్లు ప్రశంసలు!

Anushka Sharma Headstand | నిండు గర్భిణి అయితేనేం  ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నట్లు నిరూపిస్తోంది బాలీవుడ్ నటి అనుష్క శర్మ. గర్భం దాల్చక ముందే ఏవైతే ఆసనాలు అనుష్క ప్రతిరోజూ వేసేదో ఇప్పుడూ అదే కొనసాగిస్తున్నా అంటోంది. ఎంతో మంది గర్భిణులకు ఆదర్శంగా నిలుస్తోంది.

Last Updated : Dec 1, 2020, 02:08 PM IST
  • ప్రస్తుతం నిండు గర్భిణిగా నటి అనుష్క శర్మ
  • అయితేనేం ఎంచక్కా ఆసనాలు వేసేస్తోంది
  • కోహ్లీ, ట్రైనర్ సమక్షంలో యోగా, ఫిట్‌నెస్
Anushka Sharma Shirshasanam: అనుష్క శర్మ శీర్షాసనం.. నెటిజన్లు ప్రశంసలు!

బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రస్తుతం నిండు గర్భిణి. అయితేనేం  ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నట్లు నిరూపిస్తోంది. గర్భం దాల్చక ముందే ఏవైతే ఆసనాలు అనుష్క ప్రతిరోజూ వేసేదో ఇప్పుడూ అదే కొనసాగిస్తున్నా అంటోంది. ఎంతో మంది గర్భిణులకు ఆదర్శంగా నిలుస్తోంది. సాధారణంగా గర్భం దాల్చితే ఆ పని చేయవద్దు, ఈ పని చేయవద్దు అని కొన్ని నెలల తర్వాత బెడ్ రెస్ట్ ఇస్తారు.

కానీ నిండు గర్భిణిగా ఉన్న సమయంలో అనుష్క శర్మ మాత్రం కఠినమైన ఆసనాలనువేసి చూపించి నెటిజన్లతో పాటు తన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. అనుష్క శీర్షాసనం (Anushka Sharma Shirshasanam) వేసిన సమయంలో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. అనుష్క శర్మ భర్త, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆమెకు ఆసనం వేయడంలో సహాయం చేస్తున్నాడు. ట్రైనర్ పర్యవేక్షణలో అనుష్క రెగ్యూలర్ ఆసనాలు వేస్తూ తన ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ, కడుపులోని బుజ్జాయికి ఆరోగ్యాన్ని అందిస్తోందని చెప్పవచ్చు. 

Also Read : Voting Numbers of Bigg Boss 4 Contestants: ఓటింగ్ నెంబర్స్ ఇవే.. మిస్డ్ కాల్స్‌తో కంటెస్టెంట్‌ను సేవ్ చేయవచ్చు

 

ఈ సమయంలో ఆసనాలు వేయడం ద్వారా మానసిక ఉల్లాసం, నూతన ఉత్తేజం కలుగుతాయని అనుష్క శర్మ తన పోస్టులో పేర్కొంది. యోగా టీచర్ ఈషా ష్రాప్, తన భర్త విరాట్ కోహ్లీల సాయంతో తాను ఆసనాలు కొనసాగిస్తున్నాయని చెబుతోంది. డాక్టర్ల సలహాలతో దాదాపుగా గతంలో చేసే ఆసనాలు వేయవచ్చునని సూచించింది. తాను మరింత ఆరోగ్యంగా ఉండే పుట్టబోయే బిడ్డ ఇంకా ఆరోగ్యంగా పుడుతుందని అనుష్క శర్మ తల్లిగా ఆలోచించి ఆసనాలు వేయడంతో నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.
Also Read : Health Benifits Of Lemon: నిమ్మరసం తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News