Pushpa 2 OTT Date: టాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 సృష్టించిన కలెక్షన్ల విధ్వంసం అంతా ఇంతా కాదు. ఉత్తరాది, దక్షిణాది రెండింటా రికార్డు స్థాయి కలెక్షన్లు వసూలు చేసి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడిదే సినిమాను ఇకపై మీకు నచ్చినట్టు, నచ్చిన విధంగా ఎన్నిసార్లయినా చూడొచ్చు. ఈ బ్లాక్ బస్టర్ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కానుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 మెగా హిట్ కొట్టింది. భారీగా కలెక్షన్లు సృష్టించింది. ఇప్పటికే 1850 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. ఇప్పుడు పుష్ప 2 రీలోడ్ వెర్షన్ థియేటర్లలో మరోసారి హల్‌చల్ చేస్తోంది. పుష్ప 1 కంటే పుష్ప 2 భారీ హిట్ సాధించింది. రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్, రావు రమేశ్, సునీల్, అనసూయతో పాటు జగపతి బాబు కూడా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2024 డిసెంబర్ 4న విడుదలైంది.
ఇప్పుడీ సినిమా విషయంలో అల్లు అభిమానులకు కావల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ మరోసారి లభించనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైంది. జనవరి 30న ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమౌతోంది. పుష్ప 2 సినిమా జనవరి 30వ తేదీన అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అయ్యేందుకు రాబోతోంది. ధియేటర్లలో రికార్డులు కొల్లగొట్టిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌లో ఎలాంటి క్రేజ్ సృష్టిస్తుందో చూడాలి.
Also read: JEE Mains Exams 2025: నేటి నుంచి ప్రారంభమైన జేఈఈ మెయిన్స్ పరీక్షలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి