Murder Movie: ఆసక్తికరంగా ‘మర్డర్’ ట్రైలర్-2

తెలంగాణ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్య ( Pranay murder ) ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) ‘మర్డర్’ ( MURDER Movie ) సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

Last Updated : Dec 18, 2020, 09:18 AM IST
Murder Movie: ఆసక్తికరంగా ‘మర్డర్’ ట్రైలర్-2

Ram Gopal Varma's Murder Movie 2nd trailer: తెలంగాణ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్య ( Pranay murder ) ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) ‘మర్డర్’ ( MURDER Movie ) సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అంతకు ముందు మర్డర్ సినిమా మొదటి ట్రైలర్‌ను రిలీజ్ చేసిన వర్మ తాజాగా రెండో ట్రైలర్‌ను (Murder Movie 2nd trailer) విడుదల చేశారు. ఆసక్తికర సంభాషణలతో సాగే ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. పిల్లల్ని కనగలం గాని వాళ్ల మనస్తత్వాలను కనగలమా.. మీరే సమాధానం చెప్పండి అంటూ ఆలోచింపజేసే డైలాగులు, ప్రశ్నలతో రామ్ గోపాల్ వర్మ మళ్లీ తన మార్కును చూపించారు. Also read: Murder Movie: మర్డర్ మూవీ విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఇటీవలనే మర్డర్ ( Murder ) సినిమాకు సంబంధించిన అన్ని అడ్డంకులు తొలిగిపోవడంతో.. ఈ చిత్రాన్ని డిసెంబరు 24న విడుదల చేయనున్నట్లు వర్మ ప్రకటించారు. అయితే ఈ చిత్రాన్ని ఆర్జీవీ నేతృత్వంలో దర్శకుడు ఆనంద్ చంద్ర ఈ సినిమా తెరకెక్కించగా.. నిర్మాత నట్టి కరుణ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా మొదటి ట్రైలర్‌ను సైలెంట్‌గా చూపించిన వర్మ.. రెండో ట్రైలర్‌లో ఆసక్తికరమైన సంభాషణలు చూపించడంతో.. ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. Also read: RGV Murder song: పిల్లల్ని ప్రేమించడం తప్పా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News