Skanda Movie Review: ఎనర్జిటిక్ స్టార్ రామ్-బోయపాటి శ్రీను కాంబినేషన్ తెరకెక్కిన స్కంద గురువారం(సెప్టెంబరు 28) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మాస్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఫీస్ట్ అనే చెప్పాలి. ఇందులో శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. ఈచిత్రానికి శ్రీనివాస చిట్టూరి, పవన్ కుమర్ నిర్మాతలగా వ్యవహారించారు. ఈ సినిమా హిట్ పట్టా తెలుసుకోవాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే.
కథేంటి?
ఏపీ, తెలంగాణ సీఎంల కుమార్తెలను రుద్రకంటి భాస్కర్ (రామ్ పోతినేని) కిడ్నాప్ చేస్తాడు. అతడు తెలంగాణ సీఎం కుమార్తెను ప్రేమిస్తున్నట్లు నాటకం ఆడటానికి కారణం ఏంటి? స్నేహితులగా ఉన్న ఇరు రాష్ట్రాల సీఎంలు ఎందుకు శత్రువులగా మారారు? రుద్రకంటి రామకృష్ణరాజుకు, సీఎంలకు మధ్య వైరం ఏంటి? అసలు ఈ భాస్కర్ ఎవరు అనేది స్కంద మూవీ కథ.
ఎవరెలా చేశారు?
స్కంద మూవీ మెుత్తం బోయపాటి స్టైల్ లో ఉంటుంది. స్టోరీ పాతదే అయినా కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు బోయపాటి. తనదైన మాస్ ఎలిమెంట్స్, సెంటిమెంట్ తో మూవీని తెరకెక్కించిన విధానం బాగుంది. మాస్ ఆడియెన్స్ కంప్లీట్ పుల్ మీల్స్ అనే చెప్పాలి. చివరలో డ్యూయల్ రోల్ ట్విస్ట్ ఇచ్చి భారీ యాక్షన్ ఎపిసోడ్ తో సినిమాకు ఎండ్ కార్డ్ వేశారు మేకర్స్. ఇందులో రామ్ లోని మాస్ కోణాన్ని సరికొత్తగా ఆవిష్కరించాడు డైరెక్టర్. రెండు క్యారెక్టర్స్ మధ్య చూపించిన వేరియేషన్ ఆకట్టుకుంది. శ్రీకాంత్ తన నటనతో మరోసారి మెప్పించాడు. శ్రీలీల మరోసారి తన గ్లామ్ర్, డ్యాన్స్ లతో ఆడియెన్స్ ను ఫిదా చేసింది. చాలా ఏళ్ల తర్వాత ఈ మూవీ ద్వారా రాజా దగ్గుబాటి నటుడిగా రీఎంట్రీ ఇచ్చాడు. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అలరించింది. మాస్ యాక్షన్ అంశాలను ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి ఆప్షన్.
Also Read: Chandramukhi 2 Review: చంద్రముఖి 2 మూవీ హిట్టా? పట్టా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook