Ramgopal Varma: ప్రభుత్వంతో పేచీకు దిగుతున్న ఆర్జీవీ, మరోసారి వివాదాస్పద ట్వీట్

Ramgopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చేసిన మరో వ్యాఖ్య అగ్గికి ఆజ్యం పోస్తోంది. సినిమా టిక్కెట్ల వ్యవహారంపై ప్రభుత్వ నిర్ణయాలు సవాలు చేస్తూ కామెంటు చేస్తున్న ఆర్జీవీ మరో ట్వీట్ చేశాడు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 8, 2022, 12:21 PM IST
Ramgopal Varma: ప్రభుత్వంతో పేచీకు దిగుతున్న ఆర్జీవీ, మరోసారి వివాదాస్పద ట్వీట్

Ramgopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చేసిన మరో వ్యాఖ్య అగ్గికి ఆజ్యం పోస్తోంది. సినిమా టిక్కెట్ల వ్యవహారంపై ప్రభుత్వ నిర్ణయాలు సవాలు చేస్తూ కామెంటు చేస్తున్న ఆర్జీవీ మరో ట్వీట్ చేశాడు.

ఏపీలో ప్రస్తుతం సినిమా టికెట్ల సమస్య హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూ ఆర్జీవీ చేస్తున్న విమర్శలు వివాదాస్పదమయ్యాయి. టికెట్ ధరల్ని పెంచాలనే డిమాండ్‌కు మద్దతిస్తూ ఆర్జీవీ వార్తల్లో నిలవడమే కాకుండా ఆ అధికారం ప్రభుత్వానికి లేదంటున్నాడు. కొన్ని టీవీ ఛానెళ్లలో వచ్చిన చర్చల్లో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ..మంత్రి పేర్ని నానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. వరుస ట్వీట్లతో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఆ క్రమంలోనే ఈ వ్యవహారంపై చర్చకు సమయం కేటాయించాలని మంత్రి పేర్ని నానిని ఆర్జీవీ కోరారు. ఆర్జీవీకు (Ramgopal Varma)మంత్రి పేర్ని నాని అపాయింట్‌మెంట్ దక్కింది. ఈ విషయాన్ని స్వయంగా ఆర్జీవీ ట్విట్టర్ సాక్షిగా వెల్లడించాడు. జనవరి 10వ తేదీ మద్యాహ్నం అమరావతిలోని సెక్రటేరియట్‌లో మంత్రి తనకు అపాయింట్‌మెంట్ ఇచ్చారని తెలియజేసేందుకు సంతోషిస్తున్నానంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు.

మంత్రి పేర్ని నానితో ( Perni Nani)చర్చకు ముందే మరోసారి వివాదాస్పద ట్వీట్ చేశాడు. చలనచిత్రాలు, థీమ్ పార్కులు, సంగీత కచేరీలు, మ్యూజిక్ షోలు వంటివి కూడా వినోద సంస్థల కిందకు వస్తాయని..ఆ ధరల్ని ప్రభుత్వం నిర్ణయించజాలదని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. మరో రెండ్రోజుల్లో సినిమా టికెట్ ధరల అంశంపై మంత్రిని కలవనున్న ఆర్జీవీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతమనే విమర్శలు వస్తున్నాయి. తెగేవరకూ లాగేందుకే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 

Also read: Happy Birthday Yash: నేడు రాకింగ్ స్టార్ యశ్ బర్త్​ డే- కేజీఎఫ్​-2 నుంచి అప్​డేట్​!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News