Game Changer: ఫ్రాడ్ చేసి పరువుతీశారు.. బన్నీ కాళ్లు మొక్కాలి.. గేమ్ ఛేంజర్‌ పై ఆర్జీవీ ట్వీట్లు

Game Changer collections: రామ్ చరణ్ హీరోగా వచ్చిన.. గేమ్ ఛేంజర్ సినిమా గురించి..రామ్ గోపాల్ వర్మ వేసిన ట్వీట్ల.. మరింత హాట్ టాపిక్ అయ్యాయి. ప్రత్యేకించి పుష్ప 2ను పొగడుతూ, గేమ్ ఛేంజర్‌ను కించపరచడం ఆయన ట్వీట్లలో కనిపిస్తోంది. ఈ పరిణామాలు అభిమానుల మధ్య కొత్త చర్చలకు దారి తీశాయి. ముఖ్యంగా మరోసారి అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ వివాదానికి తెరతీసింది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jan 14, 2025, 09:37 AM IST
Game Changer: ఫ్రాడ్ చేసి పరువుతీశారు.. బన్నీ కాళ్లు మొక్కాలి.. గేమ్ ఛేంజర్‌ పై ఆర్జీవీ ట్వీట్లు

RGV on Game Changer fake Collections: రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు.. మరోసారి సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీపై ఆయన చేసే సెటైర్లు, విమర్శలు తరచుగా వివాదాలకు దారితీస్తుంటాయి. ఈసారి ఆయన రామ్ చరణ్ హీరోగా వచ్చిన సంక్రాంతి సినిమా గేమ్ ఛేంజర్ చిత్రంపై చేసిన వ్యాఖ్యలు, ట్వీట్లు పెను దుమారానికి కారణమయ్యాయి.  

సినిమా మొదటి రోజునే భారీ అంచనాలు ఎదుర్కొన్నప్పటికీ, యాంటీ ఫ్యాన్స్‌ చేసిన నెగెటివ్ ప్రచారం దాని క్రేజ్‌ను తగ్గించింది. అంతేకాకుండా సినిమాకి మామూలు ప్రేక్షకుల దగ్గర నుంచి కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. అయితే ఇంతలా నెగిటివ్స్ పండగ వచ్చినా కూడా మొదటి రోజు.. ఈ సినిమా ఏకంగా 186 కోట్లు కలెక్ట్ చేసిందంటూ సినిమా యూనిట్ పోస్టర్ విడుదల చేసింది.

ఈ క్రమంగా డే వన్ కలెక్షన్లను తప్పుగా చూపించడంపై వర్మ స్పందిస్తూ, అది దిల్ రాజు లాంటి వ్యక్తి చేస్తే ఉండదని తెలిపారు. అలాగే, పుష్ప 2 చిత్రాన్ని ప్రశంసిస్తూ, అల్లు అర్జున్ సుకుమార్‌ కాళ్లకు మొక్కాలని అనిపించిందని అన్నారు.  

“గేమ్ ఛేంజర్‌కు మొదటి రోజు.. 186 కోట్లు వచ్చింది నిజమైతే.. పుష్ప 2కి మొదటి రోజు.. ఏకంగా 1860 కోట్లు వచ్చినట్టా?.. మనం ఏదైనా చెబితే కొంచెం నమ్మేలా ఉండాలి.. గేమ్ ఛేంజర్‌కు 450 కోట్లు పెట్టి ఉంటే.. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకు దాదాపు 4500 కోట్లు పెట్టిన క్వాలిటీ ఉంది.. దిల్ రాజు అయితే గ్రౌండెడ్‌గా ఉండే మనిషి.. కాబట్టి ఇలాంటి ఫ్రాడ్ ఆయన  చేసి ఉండరు..నాకు పుష్ప 2 చాలా నచ్చింది.. గేమ్ ఛేంజర్‌ను చూసిన తరువాత బన్నీ, సుకుమార్ కాళ్ల మొక్కాలని అనిపిస్తోంది..,” అంటూ చెప్పుకొచ్చారు. 

అల్లు అర్జున్‌ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తిన వర్మ, మెగా ఫ్యామిలీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ వివాదం మరోసారి అల్లు, మెగా అభిమానుల మధ్య విభేదాలకు దారితీసింది. ఇక ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ అభిమానుల దగ్గర..వర్మ ట్వీట్లు ట్రోలింగ్‌కు గురయ్యాయి.  

రామ్ గోపాల్ వర్మ ట్వీట్ల వెనుక ఉన్న అసలు ఉద్దేశం స్పష్టంగా తెలియదు. అయితే, మెగా ఫ్యామిలీని విమర్శించడం, అల్లు అర్జున్‌ను పొగడటం ఒక వ్యూహం అనిపిస్తోంది. ఇది అభిమానులను మరింతగా విభజించేందుకు కారణమవుతుందా? అన్నది అందరికీ ఆసక్తికరంగా మారింది.  

కాగా వర్మ ట్వీట్లపై ఇండస్ట్రీ వారు మాత్రం స్పందించలేదు. మెగా ఫ్యామిలీకి చెందిన చిరంజీవి, నాగబాబు, అల్లు అరవింద్ గతంలో పరోక్షంగా వర్మ వ్యాఖ్యలపై స్పందించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి ఏ విధమైన ప్రత్యక్ష వ్యాఖ్యలు రాలేదు.

Read more: Mazaka Movie controversy: మా ఇంట్లోను ఆడవాళ్లున్నారు.. దయచేసి క్షమించండి.. వీడియో రిలీజ్ చేసిన త్రినాథరావు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News