RRR Poster: రామ్ చరణ్‌కి Birthday gift ఇచ్చిన రాజమౌళి

Ram Charan as Alluri Sitaramaraju: ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో ఉన్న పోస్టర్‌ను ఆ చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి విడుదల చేశాడు. మార్చి 27న మెగా పవర్ స్టార్ Ram Charan's Birthday కావడంతో అంతకంటే ఒకరోజు ముందుగానే చెర్రీ ఫ్యాన్స్‌ కోసం చెర్రీ బర్త్ డే కానుకగా ట్విటర్ ద్వారా జక్కన్న ఈ పోస్టర్‌ని విడుదల చేశాడు.

Last Updated : Mar 26, 2021, 08:41 PM IST
  • ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ పోస్టర్‌ విడుదల.
  • గతేడాది Ram Charan's Birthday సందర్భంగా Bheem for Rama Raju టీజర్ విడుదల చేసిన తారక్.
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన రామ్ చరణ్ పోస్టర్.
RRR Poster: రామ్ చరణ్‌కి Birthday gift ఇచ్చిన రాజమౌళి

Ram Charan as Alluri Sitaramaraju: ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో ఉన్న పోస్టర్‌ను ఆ చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి విడుదల చేశాడు. మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కావడంతో అంతకంటే ఒకరోజు ముందుగానే చెర్రీ ఫ్యాన్స్‌ కోసం Ram Charan Birthday కానుకగా ట్విటర్ ద్వారా జక్కన్న ఈ పోస్టర్‌ని విడుదల చేశాడు. ది మ్యాన్ ఆఫ్ బ్రేవరి, హానరి, ఇంటిగ్రిటీ ప్రజెంటింగ్ మై అల్లూరి సీతారామరాజు అంటూ రాజమౌళి తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.  

ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపించనుండగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో దర్శనం ఇవ్వనున్నాడు. గతేడాది రామ్ చరణ్ బర్త్ డే నాడు అల్లూరి సీతారామ రాజు పాత్రకు సంబంధించిన వీడియో టీజర్‌ను Bheem for Rama Raju పేరిట తారక్  విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇలా పోస్టర్‌ని విడుదల చేయగా.. కొద్దిసేపట్లోనే ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Also read : Vakeel Saab trailer: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్

అక్టోబర్ 13న వరల్డ్ వైడ్‌గా ఆడియెన్స్ ముందుకు రానున్న RRR Movie ని డివివి ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇటీవలే ఆలియా బర్త్ డే సందర్భంగా ఆమెను సీత పాత్రలో ప్రజెంట్ చేస్తున్న ఓ పోస్టర్‌ని Ram Charan విడుదల చేయగా.. తాజాగా Ram Charan's Birthday సందర్భంగా రాజమౌళి ఈ పోస్టర్‌ని విడుదల చేశాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News