Sankranthiki Vasthunnam review: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ.. వెంకటేష్, అనిల్ రావిపూడి మ్యాజిక్ రిపీట్ అయిందా..!

Sankranthiki Vasthunnam Movie review: సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కు మంచి గిరాకీ ఉంటుంది. అలాంటి కాంబినేషన్స్ లో వెంకటేష్, అనిల్ రావిపూడిది అని చెప్పాలి. గతంలో వీళ్లిద్దరి కలయికతో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 ప్రేక్షకులను మెప్పించాయి. ఇపుడు హాట్రిక్ హిట్ కోసం ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ సంక్రాంతికే థియేటర్స్ కు వస్తున్నారు. మరి ఈ సినిమాతో వెంకీ, అనిల్ రావిపూడి హాట్రిక్ హిట్ నమోదు చేసారా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 14, 2025, 12:24 PM IST
Sankranthiki Vasthunnam review: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ.. వెంకటేష్, అనిల్ రావిపూడి మ్యాజిక్ రిపీట్ అయిందా..!

మూవీ రివ్యూ: సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam)
తారాగణం: వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, సాయి కుమార్, నరేష్, ఉపేంద్ర లిమాయో, వీటీవీ గణేష్, పృథ్వీ రాజ్, శ్రీనివాస్ అవసరాల తదితరులు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
ఎడిటర్: తమ్మిరాజు
బ్యానర్: శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: అనిల్ రావిపూడి  
విడుదల తేది: 14-1-2025

వెంకటేష్ గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ దగ్గర సోలో హీరోగా సరైన సక్సెస్ అందుకోలేదు. ఈ కోవలో తనకు గతంలో మంచి విజయాలను అందించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకటేష్ మార్క్ కామెడీతో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ ను  మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..
సత్య ఆకెళ్ల (అవసరాల శ్రీనివాస్) ప్రపంచం వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న తెలుగు సాఫ్ట్ వేర్ దిగ్గజం. యూఎస్ లో ఉండే అతను భారత పర్యటనలో భాగంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వస్తాడు. ఈ క్రమంలో అతన్ని బిజు పాండే గ్యాంగ్ కిడ్నాప్ చేస్తోంది. అతన్ని విడిచిపెట్టాలంటే చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తూన్న తన అన్న పాప పాండే ను విడిచిపెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి (నరేష్)కు  కండిషన్ పెడతాడు. ఈ క్రమంలో సత్య ఆకెళ్లను విడిపించుకు రావడానికి సస్పెండ్ అయిన డీసీపీ యాదగిరి దామోదర్ రాజు (వెంకటేష్) సరైన వ్యక్తి అని డీజపీతో పాటు అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కమ్ పోలీస్ కాప్ అయిన మీనాక్షి (మీనాక్షి చౌదరి) చెబుతుంది. తెలంగాణ నుంచి తూర్పు గోదావరిలో పెళ్లి చేసుకోని పోలీసు ఉద్యోగానికి దూరంగా ఉన్న వైడీ రాజు అలియాస్ చిన్న రాజును ఈ ఆపరేషన్ ను ఒప్పించడానికి అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వస్తోంది. ఈ క్రమంలో రాజు ఈ ఆపరేషన్ టేకప్ చేసాడా.. ? ఆల్రెడీ పెళ్లై పిల్లులున్న అతని భార్యకు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి అన్ని విషయాలు చెబుతాడు. దీంతో ఈ ఆపరేషన్ లో భాగంగా అతని భార్య (ఐశ్వర్య రాజేష్ ) కూడా వస్తానంటోంది. ఈ క్రమంలో సత్య ఆకెళ్లను వైడీ రాజు విడిపించాడా..? ఈ క్రమంలో చర్లపల్లి జైలు సూపరెండెంట్ ఆంటోని (ఉపేంద్ర లిమాయో) పాత్ర ఏమిటి ? అనేది తెలియాలంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా చూడాల్సిందే.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
అనిల్ రావిపూడి ప్రస్తుతం కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. అంతేకాదు మినిమం గ్యారంటీ దర్శకుడిగా అపజయం ఎరగని డైరెక్టర్.తాజాగా వెంకటేష్ తో ఎలాంటి కథతో సినిమా చేస్తే వర్కౌట్ అవుతుందో అలాంటి కథతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను  తెరకెక్కించాడు. సాధారణంగా సినిమా అంటెనే లాజిక్ కు దూరంగా ఉండేదే సినిమా. ఇపుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా చూస్తున్నంత సేపు లాజిక్ ఆలోచించకూడదు. లాజిక్ కు దూరంగా క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు.గతంలో శివ నాగేశ్వరరావు తెరకెక్కించిన ‘హ్యాండ్సప్’ సినిమాతో పాటు ఇవివి తీసిన కొన్ని కామెడీ సినిమాలనే అటు ఇటు తప్పి.. తెరకెక్కించాడు. ముఖ్యంగా ఓ రాష్ట్రానికి వచ్చిన వీవీఐపీని ఓ మాములు గ్యాంగ్ కిడ్నాప్ చేయడం వంటివి సిల్లీగా అనిపిస్తుంది. అయిన హీరో, హీరోయిన్ తో ఎపుడు అదే యావ అన్నట్టు చూపించడం కొంత ఇబ్బంది కరంగా ఉంటుంది. ఓవరాల్ గా అందులో వచ్చే కామెడీతో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టాడు. మరోవైపు చర్లపల్లి జైలు  సూపర్ రెండెంట్ తో నిజాయితీ గల ఆఫీసర్ అని చూపెట్టి అతన్ని బఫూన్ లా చూపించడం అన్ని ప్రేక్షకులను నవ్వించడానికి యూజ్ చేసుకున్నాడు. సినిమాలో వచ్చే ప్రతి సీన్ లో కామెడీని చూపెట్టే ప్రయత్నం చేసాడు. కొన్ని సీన్స్ కు పడి పడి నవ్వడం ఖాయం. ముఖ్యంగా హీరో కొడుకు ఓటీటీ వెబ్ సిరీస్ లు చూసి బూతులు నేర్చుకొని ఊర్లో వాళ్లను తిట్టే సీన్స్ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. హీరోకు  ఇప్పటి జనరేషన్ ఎంత ఫాస్ట్ గా ఉన్నారో చూపెట్టాడు అనిల్ రావిపూడి. అటు భర్తకు పెళ్లికి ముందు ప్రియురాలు ఉంటే.. ఆ ఇల్లాలు ఎలాంటి క్షోభను అనుభవిస్తుందో కామెడీగా చెప్పే ప్రయత్నం చేసాడు.మొత్తంగా అనిల్ రావిపూడి ఎఫ్ 2, ఎఫ్ 3 తరహాలో భార్యల టార్చర్ కు భర్తలు ఎలా క్షోభను అనుభిస్తారనేది మరోసారి ఈ సినిమాలో చూపెట్టాడు. మరోవైపు హీరోకు వయసైపోయింది పోలీస్ డ్యూటికి అన్ ఫిట్ అని చూపించడం మాత్రమే లాజికల్ గా ఉంది.  ఈ సినిమాలో   వెతుక్కుంటూ వెళితే లాజిక్ కు అందని సీన్స్ ఎన్నో ఉన్నాయి. ఈ సినిమాకు కథన్నదే లేదు. కేవలం వరుస కామెడీ సన్నివేశాలతో  ప్రేక్షకులను చివరి వరకు  సీట్లలో కూర్చెబట్టగలిగాడు. అందులో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ కాబట్టి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ పెట్టారు. ఆ టైటిల్ కాకపోయినా.. ఈ సినిమా ఏ పండక్కి ముందు రిలీజ్ చేస్తే.. ఆయా పండగ పేర్లు పెట్టుకోవచ్చు.  శివరాత్రికి వస్తున్నాం, దసరాకు వస్తున్నాం, లేకపోతే దీపావళికి వస్తున్నాం అని టైటిల్ పెట్టినా పెద్దగా వచ్చినా నష్టమేమి లేదు. మొత్తంగా సంక్రాంతి పండక్కి కాస్త రిలీఫ్ కోసం కామెడీ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్లకు ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమా బెస్ట్ ఆప్షన్.  

నటీనటుల విషయానికొస్తే..
వెంకటేష్ .. ఎలాంటి నటుడో మనం చూస్తూనే ఉన్నాము. ఆయన కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో కూడా తెలుసు. ఈ సినిమాను కూడా వెంకటేష్ తన కామెడీ కమ్ యాక్షన్ తో సినిమాకు మెయిన్ పిల్లర్ గా నటించాడు. అలని భార్య పాత్రలో నటించిన ఐశ్వర్య రాజేష్ కూడా ఓ సగటు ఇల్లాలి పాత్రలో భర్తకు పెళ్లికి ముందు ఓ అమ్మాయితో లవ్ ఉందని తెలుసుకొని ఉడికిపోయే పాత్రలో జీవించింది. అటు మీనాక్షి చౌదరి.. వెంకటేష్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో అతని భార్యను టీజ్ పాత్రలో మెప్పించింది. అటు ఉపేంద్ర లిమాయో, నరేష్, వీటీ గణేష్, సాయి కుమార్,  పప్పు గ్యాంగ్ మెంబర్స్ అందరు తన కామెడీతో మెప్పించారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.

ప్లస్ పాయింట్స్

వెంకీ కామెడీ

అనిల్ రావిపూడి టేకింగ్

ఆర్ఆర్, మ్యూజిక్

నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్

కథ

లాజిక్ లేని సీన్స్

పంచ్ లైన్.. ‘సంక్రాంతికి వస్తున్నాం’..నో లాజిక్.. వెంకీ, అనిల్ రావిపూడిల మ్యాజిక్

రేటింగ్: 3/5

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

ఇదీ చదవండి: Prabhas Marriage: ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్.. డార్లింగ్ చేసుకోబోయేది ఈమెనే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News