Kangana Ranaut: నడిరోడ్డుపై రేప్ చేస్తామంటూ బెదిరింపులు

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఆమె చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలతో బెదిరింపుల పర్వం ప్రారంభమైంది.ఇప్పుడు ఏకంగా నడిరోడ్డుపై రేప్ చేస్తానంటూ వార్నింగ్ వచ్చింది.

Last Updated : Oct 21, 2020, 12:52 PM IST
Kangana Ranaut: నడిరోడ్డుపై రేప్ చేస్తామంటూ బెదిరింపులు

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ( Bollywood firebrand kangana ranaut ) కు బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఆమె చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలతో బెదిరింపుల పర్వం ప్రారంభమైంది.ఇప్పుడు ఏకంగా నడిరోడ్డుపై రేప్ చేస్తానంటూ వార్నింగ్ ( Rape warning to kangana ranaut )వచ్చింది.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant singh rajput ) మరణ వ్యవహారం నుంచి నిత్యం వార్తల్లో ఉంటూ హాట్ టాపిక్ గా మారిన కంగనా రనౌత్ అందర్నీ టార్గెట్ చేస్తోంది. నెపోటిజం ( Nepotism ) , డ్రగ్స్ వ్యవహారంలో తీవ్రమైన కామెంట్ల చేయడమే కాకుండా..మహారాష్ట్ర ప్రభుత్వం ( Maharashtra Government ) తో నేరుగా సై అంటే సైకి దిగింది. రాజకీయనేతలు, ప్రముఖ సెలెబ్రిటీలు ఎవర్నీ వదలకుండా వ్యాఖ్యలు చేస్తూ వివాదాస్పదంగా మారింది. సోనియా గాంధీ, జయాబచ్చన్, ఉద్ధవ్ ధాకరే, సంజయ్ రౌత్, దీపికా పడుకోన్, వ్యవసాయం చట్టాన్ని వ్యతిరేకిస్తున్న రైతులు ఇలా అందరూ ఆమెకు టార్గెట్ అవుతున్నారు. ముంబై పోలీసుల్ని( Mumbai police ) బాబర్ సేనగా కంగనా రనౌత్ వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా బాలీవుడ్ లో కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్ వ్యవహారంపై ( Mumbai drugs case ) తీవ్రమైన కామెంట్లే చేస్తూ వచ్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ( Maharashtra cm udhav thackeray ) పై అయితే తీవ్రంగానే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఈ నేపధ్యంలోనే కంగనాకు ఈ మధ్య కాలంలో బెదిరింపులు కూడా వస్తున్నాయి. చంపేస్తామనే బెదిరింపులు వచ్చాయి. రైతుల్నితీవ్రవాదులతో పోల్చినందుకు టుంకూరు కోర్టు ఆదేశాలతో కర్నాట పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాజాగా ముంబై పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బాంద్రా కోర్టు ( Bandra court ) ఆదేశాలతో దేశద్రోహం కేసు కూడా నమోదైంది.  కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చందేల్ బాలీవుడ్, ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, దీంతోపాటు మత విద్వేశాలను రెచ్చగొడుతున్నారంటూ ఫిర్యాదు చేయగా.. పోలీసులు తన ఫిర్యాదును నమోదు చేయలేదంటూ  అష్రఫ్ అలీ సయ్యద్ బాంద్రా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శనివారం విచారించిన బాంద్రా కోర్టు ఆమెపై కేసు నమోదు చేయాలని ముంబై పోలీసులను ఆదేశించింది.

ఈ కేసులపై స్పందించిన కంగనా రనౌత్ చేసిన కామెంట్లు కూడా విమర్శలకు గురవుతున్నాయి. నవరాత్రి వేళ ఎవరు ఉపవాసమున్నారు...ఈ రోజు వేడుకల ఫోటోలివి..నా పై మరో కేసు నమోదైంది. మహారాష్ట్రలోని పప్పుసేను నాపై మక్కువ ఎక్కువైనట్టుంది. నన్ను మిస్ కావద్దు. త్వరలోనే అక్కడకు వస్తా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసింది. దీనిపై స్పందిస్తూ ఒడిశాకు చెందిన ఓ న్యాయవాది నడిరోడ్డుపై రేప్ చేస్తా నంటూ కామెంట్ పెట్టాడు. ఇప్పుడిదే సంచలనంగా మారింది.

ప్రస్తుతం మనాలీలో తన సోదరి పెళ్లివేడుకలో ఉన్న కంగనా రనౌత్ ఇంకా స్పందించలేదు. కానీ అదే న్యాయవాది మాత్రం వివరణ ఇచ్చాడు. తన ఎక్కౌంట్ హ్యాక్ అయిందంటూ పోస్టు చేశాడు. తన పేరిట తన ఎక్కౌంట్ లో అభ్యంతరకర వ్యాఖ్యలున్నాయని..మహిళల్ని సమాజాన్ని ఉద్దేశించిన ఆ వ్యాఖ్యలు తనవి కావని సదరు న్యాయవాది చెప్పారు. తన స్నేహితుల ద్వారా ఈ విషయం తెలుసుకుని షాక్  అయ్యానని..ఎవరి మనోభావాలైనా దెబ్బతినుంటే క్షమించాలని కోరారు. 

మరి ఈ వ్యాఖ్యలపై గానీ సదరు న్యాయవాది వివరణపై గానీ కంగనా ( Kangana Ranaut ) ఎలా స్పందిస్తుందో చూడాలి. న్యాయవాది కోరినట్టు క్షమిస్తుందా లేదా మరో పంచ్ ఏమైనా విసురుతుందా చూడాలి. Also read: Happy Birthday Prabhas: రాధేశ్యామ్ సర్‌ప్రైజ్ వచ్చేసింది..

Trending News