Support to Dil Raju: దిల్ రాజుకు అండగా తమిళ నిర్మాతలు... 'వారసుడు'ను టచ్ చేస్తే, తెలుగు సినిమాలు ఆడనివ్వం?

Tamil Producers into Varisu Issue: వారసుడు సినిమా వివాదంలోకి ఇప్పుడు తమిళ నిర్మాతలు ఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 19, 2022, 03:09 PM IST
Support to Dil Raju: దిల్ రాజుకు అండగా తమిళ నిర్మాతలు... 'వారసుడు'ను టచ్ చేస్తే, తెలుగు సినిమాలు ఆడనివ్వం?

Tamil Producers to enter into Varisu Issue: దిల్ రాజు వారసుడు సినిమా విషయంలో ఇప్పుడు ఏర్పడిన వివాదం ముదిరే అవకాశం కనిపిస్తోంది. గతంలో దిల్ రాజు తీసుకున్న నిర్ణయాలే ఇప్పుడు ఆయనకి తలనొప్పిగా మారాయి. గతంలో దిల్ రాజు స్ట్రైట్ సినిమాలు చేసిన సమయంలో కొందరు నిర్మాతలు డబ్బింగ్ సినిమాలు కొనుక్కుని సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయాలని భావిస్తే ఆ సినిమాలకు థియేటర్లు దక్కకుండా తన తెలుగు సినిమాకి దక్కించుకునే ప్రయత్నం చేశాడు ఆయన. అప్పుడు ఏంటి అని అడిగితే తెలుగు సినిమాలు ఉండగా వేరే భాష నుంచి సినిమాలు కొనుక్కుని తీసుకురావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించాడు. ఆ తరువాత ఏడాది ఆయనకు తెలుగు సినిమాలు దక్కకపోవడంతో ఆయన ఒక డబ్బింగ్ సినిమా కొన్నాడు.

అంతకు ముందు ఏడాది చెప్పిన లాజిక్ తనకు వర్తించదు అన్నట్లుగా విచ్చలవిడిగా తన థియేటర్లలో ఆ డబ్బింగ్ సినిమా ఆడించాడు. ఈసారి ఒక అడుగు ముందుకు వేసి తమిళ హీరోగా విజయ్ హీరోగా వారసుడు అనే సినిమా చేస్తున్నాడు. వాస్తవానికి ఇది అనౌన్స్ చేసిన సమయంలో ద్విభాషా చిత్రమని ప్రకటించారు. తమిళ హీరో, తెలుగు దర్శకుడు కాబట్టి రెండు భాషల్లోనూ సినిమా తెరకెక్కిస్తున్నారని అనుకున్నారు. కానీ ఈ సినిమా విభాష చిత్రం కాదని డైరెక్ట్ తమిళ్ ఫిలిమ్ అని దాన్ని తెలుగులో డబ్బింగ్ చేస్తున్నామని ఆ తర్వాత ఒక సందర్భంలో దిల్ రాజు కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. వాస్తవానికి తెలుగు సినిమా నిర్మాతలు అందరూ నిర్మాణ వ్యయం పెరిగిపోతోంది దానికి అడ్డుకట్ట వేయాలి అని చెబుతూ తెలుగు సినిమా షూటింగ్స్ అన్నీ నిరవధికంగా వాయిదా వేశారు.

ఈ నిర్ణయం వెనక ఉన్నది కూడా దిల్ రాజే. కానీ తన సొంత సినిమా షూటింగ్ మాత్రమే ఆయన ఆపలేదు. అదేమిటి అని ప్రశ్నిస్తే తనది తెలుగు సినిమా కాదని తమిళ స్ట్రైట్ సినిమా అని తెలుగులో డబ్బింగ్ చేస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు సరిగ్గా అదే పరిస్థితుల్లో సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు రిలీజ్ కి రంగం సిద్ధమవుతోంది. ఈ సమయంలో దిల్ రాజు తెలివిగా తన సినిమాని కూడా రిలీజ్ చేసేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. డైరెక్ట్ తెలుగు సినిమాలు కంటే తన సినిమాకి ఎక్కువ థియేటర్లు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ విషయం మీద తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక హెచ్చరిక కూడా జారీ చేసింది.

ఎగ్జిబిటర్లు తొలి ప్రాధాన్యత తెలుగు సినిమాలకి ఇవ్వాలని పేర్కొంది. అయితే సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలు కాకుండా తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగు నిర్మాతలు మండలి తీసుకున్న నిర్ణయంపై తమిళ దర్శకులు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తెలుగు సినిమాలను మా దగ్గర అంటే తమిళంలో ఆదరిస్తుంటే తమిళ సినిమాలు అనే కారణంతో రిలీజ్ ఆపడం ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈనెల 22వ తేదీన తమిళ నిర్మాతలు భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ఈ వారసుడు వివాదం మీద చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ తమిళ్ సినిమా అనే ఉద్దేశంతో వారసుడు రిలీజ్ ని కనుక పరిమితం చేసినా లేకపోతే థియేటర్లు తగ్గించినా భవిష్యత్తులో తెలుగు సినిమాలకు తమిళంలో కూడా అదే పరిస్థితి రిపీట్ అవుతుందని ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటామని వారు తెలుగు నిర్మాతల మండలి ఒక లేఖ రాసే అవకాశం కూడా ఉందని అంటున్నారు.

ఒక రకంగా తమిళ నిర్మాతలు అందరూ కూడా ఈ విధంగా దిల్ రాజుకు బాసటగా నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే దీని వెనుక నిజంగా దిల్ రాజు ఉన్నారా? ఆయన చక్రం తిప్పారా? లేక తమిళ నిర్మాతలే ముందుకు వచ్చి ఇలా చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. గతంలో కూడా పొన్నియన్ సెల్వన్ సినిమా తెలుగులో విడుదలైనప్పుడు కూడా తమిళ ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులు కావాలనే తమ సినిమాని తొక్కేస్తున్నారు అంటూ కామెంట్లు చేశారు. అయితే వాస్తవానికి అది తమిళ నేటివిటీ ఉన్న కథ కావడంతో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. మొత్తం మీద ఈ వారసుడు వివాదం మాత్రం రెండు భాషల సినీ పరిశ్రమల మధ్య పెద్ద యుద్ధమే తెచ్చి పెట్టేలా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read: Gaalodu Craze: మంచు విష్ణు జిన్నా క్లోజింగ్ కలెక్షన్స్ ను ఒక్కరోజులో చిత్తు చేసిన 'గాలోడు' సుడిగాలి సుధీర్

Also Read: Tollywood Heroine: డైరెక్టర్ కు నరకం చూపించిన హీరోయిన్.. ఆ మాట అన్నాడని అడుక్కునేలా చేసిందట!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News