Mahathalli Baby Bump: గర్భం దాల్చిన యూట్యూబర్ 'మహాతల్లి'.. ఆమె భర్త ఎవరో తెలుసా?

Mahathalli Jahnavi Dasetty Baby Bump Photo: యూట్యూబ్‌తో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేస్తున్న ప్రముఖ యూట్యూబర్‌ గర్భం దాల్చగా.. త్వరలోనే తల్లి కాబోతున్నది. అయితే ఆమెతో కలిసి నాగబాబు కుమార్తె సందడి చేసిన వీడియో వైరల్‌గా మారింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 6, 2025, 06:43 PM IST
Mahathalli Baby Bump: గర్భం దాల్చిన యూట్యూబర్ 'మహాతల్లి'.. ఆమె భర్త ఎవరో తెలుసా?

Mahathalli Baby Bump: తన కంటెంట్‌తో ప్రేక్షకులకు వినోదం అందిస్తున్న ప్రముఖ యూట్యూబర్‌ గర్భం దాల్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె గర్భం దాల్చి కొన్ని రోజుల్లో ప్రసవానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. బుల్లితెర ద్వారా ప్రేక్షకులకు పరిచయమై గుర్తింపు పొందిన ఆమెకు నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన భర్తతో కలిసి.. దాంతోపాటు రెగ్యులర్‌గా తన ఆరోగ్య విషయాలు పంచుకుంటున్నారు. త్వరలోనే పండంటి బిడ్డను కనాలని నెటిజన్లు ఆశీర్వదిస్తున్నారు. ఇంతకీ ఎవరో ఆ యూట్యూబర్‌ తెలుసా?

Also Read: Telugu Film Chamber: తెలుగు సినిమా పుట్టినరోజు అవార్డులు.. ప్రతియేటా ఫిబ్రవరి 6న ఘనంగా వేడుకలు

యూట్యూబ్‌ అప్పుడప్పుడే వస్తున్న కాలంలో చిన్న చిన్న వీడియోలు చేస్తూ అనంతరం ఛానల్‌ పెట్టడంతో తెలుగులో ఆమె మొదటి యూట్యూబర్‌గా గుర్తింపు పొందారు. ఆమెనే మహాతల్లి అలియాస్‌ జాహ్నవి దాశెట్టి. 'మహాతల్లి' పేరిట వీడియోలు చేస్తూ ప్రేక్షకులను కట్టి పడేస్తున్న ఆమె కొన్నేళ్ల కిందట తాను ప్రేమించిన సుశాంత్‌ రెడ్డిని వివాహం చేసుకుంది. కొన్ని నెలల కిందట ఆమె గర్భం దాల్చడంతో జాహ్నవి, సుశాంత్‌ దంపతుల ఆనందానికి అవధుల్లేవు. ప్రస్తుతం ఆమె ఏడో నెల ఉందని తెలుస్తోంది.

Also Read: Upasana Konidela: పవన్ కల్యాణ్ కోడలు సంచలన నిర్ణయం.. పిఠాపురం నుంచే 'ఆ పనికి' శ్రీకారం

గర్భంతో ఉన్న జాహ్నవికి పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక మెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె నిహారికకు జాహ్నవి మంచి స్నేహితురాలు. దీంతో జాహ్నవి గర్భం దాల్చిన విషయం తెలుసుకుని నిహారిక తరచూ మహాతల్లి వద్దకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా మహాతల్లిని కలిసి ఆమెతో నిహారిక సరదాగా గడిపింది. దానికి సంబంధించిన వీడియోను నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.

మహాతల్లిగా పేరొందిన జాహ్నవి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా. నిఫ్ట్‌లో ఫ్యాషన్‌ టెక్నాలజీ చదివిన జాహ్నవి కొన్నాళ్లు ఫ్యాషన్‌ రంగంలో పని చేశారు. అనంతరం షార్ట్‌ ఫిల్మ్స్‌ వైపు దృష్టి సారించారు. హరీశ్‌ నాగరాజు అనే దర్శకుడితో కొన్నాళ్లు జాహ్నవి షార్ట్‌ ఫిల్మ్స్‌కు పని చేశారు. వీరిద్దరి కలయికలో 'మహాతల్లి, మహానుభావుడు' వెబ్‌ సిరీస్‌తో ఆమెకు విశేషంగా గుర్తింపు లభించింది. అనంతరం మహాతల్లి పేరిట సొంతం యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించి ప్రముఖ యూట్యూబర్‌గా గుర్తింపు పొందారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News