Venu Swamy apology to telangana women's commission: గతంలో చైతు, సమంతలకు మధ్య విడాకులు జరిగిన విషయం తెలిసిందే. చైతు, సామ్ లు విడిపోతారని వేణు స్వామి పెళ్లి తర్వాత జోస్యం చెప్పారు. అచ్చం అదే విధంగా వీరిద్దరు విడిపోయారు. అప్పటి నుంచి వేణు స్వామి సెలబ్రీటీల జ్యోతిష్యుడిగా ఒక్కసారిగా ఫెమస్ అయిపోయారు. మరోవైపు కాంట్రవర్సీలకు కూడా కేరాఫ్ గా మారారు. ఇదిలా ఉండగా.. శోభిత, చైతులు గతేడాది తొలుత ఎంగెజ్ మెంట్ చేసుకున్నారు.
వీరి ఎంగెజ్ మెంట్ అయ్యిందో లేదో.. వేణు స్వామి రంగంలోకి దిగాడు. వీరిద్దరు కూడా విడాకులు తీసుకుని విడిపోతారని జ్యోతిష్యం చెప్పాడు. ఒక యువతి వల్ల వీరిద్దరి మధ్య గొడవలు వస్తాయని వేణు స్వామి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇవి కాస్త దుమారంగా మారాయి. దీనిపై అక్కినేని అభిమానులు మండిపడ్డారు. మరోవైపు.. ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు సైతం.. తెలంగాణ మహిళ కమిషన్ కు వేణుస్వామి వ్యాఖ్యలపై ఫిర్యాదులు చేశారు.
దీంతో ఉమెన్స్ కమిషన్.. గతంలో వేణు స్వామికి నోటీసులు పంపారు. దీనికి ఆయన హైకోర్టుకు ఆశ్రయించారు. కానీ హైకోర్టు ఇటీవల.. తప్పకుండా.. ఉమెన్ కమిషన్ ముందు హజరు కావాల్సిందే అని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వేణు స్వామి ఈ రోజు మహిళ కమిషన్ ఎదుట హజరయ్యారు. చైతు, శొభితలపై చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు.
ఉమెన్ మహిళ కమిషన్ ముందు.. బహిరంగా క్షమాపణ చెప్పారు. అదే విధంగా తన వ్యాఖ్యల పట్ల వేణు స్వామి కూడా రీగ్రేట్ అయ్యారు. ఇక మీదట ఇలాంటి కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేయోద్దని తెలంగాణ ఉమెన్ కమిషన్ వేణుస్వామికి గట్టిగానే చివాట్లు పెట్టింది. మరోసారి ఇలా వ్యవహరిస్తే.. చర్యలు ఉంటాయని కూడా మహిళ కమిషన్ వేణు స్వామికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter