Anushka Sharma Sister: చిత్ర పరిశ్రమలో ఓ హీరో, హీరోయిన్ అదృష్టం అనేది ఒక్క శుక్రవారంతోనే మారిపోతుంది. అందులో ఎవరికి అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో ఊహించడం అసాధ్యం. కొంతమంది కొన్నేళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నా.. అంతగా పేరు రాదు. మరికొందరు మాత్రం రాత్రికీ రాత్రే స్టార్ట్స్ అయిపోయిన సందర్భాలున్నాయి. రుహానీ శర్మ: విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ చెల్లెలు రుహాని శర్మ హీరోయిన్ గా ఎదగాలని అక్క బాటలో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అయితే, అదృష్టం అందరికీ ఒకేలా ఉండదు.అయితే..రుహాని మాత్రం అక్క మాదిరి సినీ ఇండస్ట్రీలో పెద్ద పేరు సంపాదించలేకపోయింది. అనుష్క శర్మ సోదరి రుహాణి శర్మ 2018లో తెలుగు చిత్రం ‘చిలసౌ’ తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు విజయం సాధించింది. అంతేకాదు ఈ సినిమా ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో జాతీయ అవార్డును గెలుచుకుంది.
అక్కినేని నాగేశ్వరరావు మనవడు.. నాగార్జున మేనల్లుడు సుశాంత్ హీరోగా నటించిన ఈ సినిమా కథ పూర్తిగా ఒకే రోజులో జరుగుతుంది. భావోద్వేగాలు, హాస్యం రెండింటినీ సమపాళ్లలో రంగరించిన ఈ చిత్రంలో రుహానీ శర్మ తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది.‘చిలసౌ’ చిత్రంతో కీర్తిని సంపాదించుకున్నా ఈ నటి.. ఆ తర్వాత కెరీర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఆ తర్వాత రుహానీ శర్మ నటించిన డర్టీ హ్యారీ, హండ్రెడ్ ఏకర్స్ బ్యూటీ, హార్ వంటి చిత్రాలు ఈమెకు మంచి హీరోయిన్‌గా పేరు తీసుకొచ్చాయి.
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
బాలీవుడ్ కంటే తెలుగులోనే ఎక్కువ ఆఫర్లు అందుకుంటున్న రుహానీ శర్మ, అనుష్క శర్మ సొంత చెల్లి కాదు.. బాబాయి కూతురు అవుతుంది. రుహానీ శర్మ స్వయంగా ఈ విషయాన్ని చాలా ఇంటర్వ్యూలలో ప్రస్తావించింది కూడా.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.