Vishwak Sen Gaami Movie Public Talk: డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మాస్ కా దాస్ విశ్వక్‌సేన్.. మరో అదిరిపోయే ప్రాజెక్ట్ 'గామి'తో నేడు ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తొలిసారి అఘోర పాత్రలో నటించడం.. ట్రైలర్ విజువల్ వండర్‌గా అనిపించడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాందిని చౌదరి హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. విద్యాధర్ కాగితా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. మహా శివరాత్రి కానుకగా నేడు (మార్చి 8) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి మొదలుపెట్టింది. మరి విశ్వక్‌సేన్ 'గామి' ఆడియన్స్‌ను మెప్పించిందా..? ఇప్పటికే సినిమా చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో ఎలాంటి రివ్యూలు ఇస్తున్నారు..? ట్విట్టర్ టాక్ ఎలా ఉంది..? ఓ లుక్కేయండి.
గామి మూవీ సూపర్‌గా ఉందని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు. గామి విజువల్ వండర్ అని.. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందన్నాడు. మ్యూజిక్ అద్భుతంగా ఉందని.. అన్నా ఏం కొట్టి తీశారంటూ రాసుకొచ్చాడు. పక్కా నేషనల్ అవార్డ్ ఫిక్స్ అయిపోండి అని పోస్ట్ పెట్టాడు. "టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలాంటి సినిమాలు మరిన్ని ఎందుకు తీయలేకపోతోంది..? విశ్వక్‌సేన్ పెర్ఫార్మెన్స్ ఓ రేంజ్‌లో ఉంది. బీజీఏం అదిరిపోయింది. VFX మనసుకు హత్తుకునేలా ఉంది. కథ ఇంట్రెస్టింగ్‌గా.. డిఫరెంట్‌గా ఉంది. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా ఉన్నా.. సెకండాఫ్ చాలా బాగుంది. కచ్చితంగా సినిమాకు వెళ్లండి.." అని మరో నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.
Visual Wonder
Highly intriguing
Spectacular MusicAnna em kotti teesaru anna #Gaami
Pakka National Award Fix aipondi Team. @VishwakSenActor Next level undi movie. Hatsoff to the Director #Vidyadhar
Music aithe ammooo 🥵🥵#GaamiReview #LondonPremiereShow pic.twitter.com/cCSs8YndeC
— Joker Reviews🇬🇧 (@IdiTeluguCinema) March 7, 2024
#Gaami why can’t TFI make more movies like this. #VishwakSen what a performance man. BGM is top notch. VFX looks mind blowing 🤯. Story is engaging and different. On the downside 1st half pacing is a bit slow paced but 2nd half is good. Unique attempt. Go for it. 3.75/5 pic.twitter.com/ZG7gZPl3bL
— AllAboutMovies (@MoviesAbout12) March 8, 2024
"అందరూ ఈ సినిమాను ఎలా తీసుకుంటారో తెలియదు.. మీరు కాస్త ఓపికతో చూస్తే సెకండాఫ్ చూస్తే బంపర్ హిట్. మొదటి హాఫ్ ఇంకా చాలా బాగుంది. అద్భుతమైన బీజీఎం. చివరి 30 నిమిషాల సెకండ్ హాఫ్ సూపర్‌గా ఉంది." అని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.
Not sure how everyone gonna take it.. if you watch 2nd half with proper patience this is a winner. Very good first half with avg 2nd half. Amazing storyline with outstanding bgm.. Last 30 mints saved second half..
3.25/5#Gaami— Tony (@tonygaaaadu) March 8, 2024
ఇప్పుడే గామి సినిమా చూశామని.. ఇలాంటి కథను నమ్మి ఐదేళ్లు కష్టపడ్డ కార్తిక్‌కు హ్యాట్సాఫ్ అంటున్నారు. విద్యాధర్ ఇంత మంచి అవుట్ పుట్ కోసం చాలానే కష్టపడ్డాడని చెబుతున్నారు. సినిమాటోగ్రఫీ, ఆర్ఆర్ టాప్ నాచ్‌లో ఉన్నాయని మెచ్చుకుంటున్నారు. స్క్రీన్ ప్లే ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేదని పోస్టులు పెడుతున్నారు.
#Gaami : Too good first half followed by not so engaging 2nd half. Felt dragged a bit in the 2nd half at the same time crucial sequences were rushed. Technical departments are too good. Best visuals and cinematography in recent times.
Go for it guys.
rating 3/5 https://t.co/v371PPWMXr
— Uma Shankar Reddy (@shankar33388) March 7, 2024
ఫస్ట్ హాఫ్ బాగుందని.. సెకండాఫ్ అంత ఎంగేజింగ్‌గా లేదంటూ మరో నెటిజన్ రివ్యూ ఇచ్చాడు. కాస్త సాగదీసినట్టుగా అనిపించిందని.. అసలైన సీక్వెన్స్ మిస్ అయినట్లుగా అనిపించిందని చెప్పాడు. అయితే టెక్నికల్‌గా గామి మూవీ హైలెట్‌గా ఉందని.. బెస్ట్ విజువల్స్ అని పోస్ట్ చేశాడు. రీసెంట్ టైమ్‌లో ఇదే బెస్ట్ సినిమాటోగ్రఫీ అని.. సినిమాను తప్పకుండా చూడొచ్చన్నాడు.
Seriously team pettina hardwork ki wonderful product icharu but ekado 2nd half knchm lag anipinchindi.. 1st is better in content 2nd half is good in visuals, bgm and twist and that Climax Lion Episode.. Special mention to VFX wow a budget lo amazing #Gaami
— Krishna🇮🇳🇬🇧 (@SaiKrishnaJSPK) March 7, 2024