Ram Charan At Good Morning America: రామ్ చరణ్.. రామ్ చరణ్.. రామ్ చరణ్.. ఇప్పుడు సినీవర్గాల్లో ఎక్కడ చూసినా అందరి నోట వినిపిస్తున్న పేరు ఇదే. అందుకు కారణం రామ్ చరణ్‌కి ఓ అరుదైన గౌరవం దక్కడమే. వరల్డ్ ఫేమస్ టీవీ షో అయిన గుడ్ మార్నింగ్ అమెరికా అనే కార్యక్రమానికి రామ్ చరణ్ అతిథిగా పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందుకోవడమే కాదు.. ఆ కార్యక్రమానికి హాజరై తాను నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ఆర్ఆర్ఆర్ మూవీ మొదలుకుని తన పర్సనల్ లైఫ్ వరకు అనేక అంశాలపై మనసులోని భావాలను ఆ వేదికపై పంచుకున్నాడు.
ఈ సందర్భంగా గుడ్ మార్నింగ్ అమెరికా షో హోస్టుల్లో ఒకరైన జెన్నిఫర్ ఆస్టన్ మాట్లాడుతూ.. కొత్తగా తండ్రి అవుతున్నాననే భయం మీలో ఏమైనా ఉందా అని ప్రశ్నించింది. ఆమె ప్రశ్నకు రామ్ చరణ్ స్పందిస్తూ.. ఇంతకాలం పిల్లలను ప్లాన్ చేయడానికి ముందు తన భార్య ఉపాసనతో చాలా సమయం స్పెండ్ చేసేవాడినని.. కానీ ఇప్పుడు తాను తండ్రి అవుతున్నానని తెలిశాకా వరుస షెడ్యూల్స్‌తో సమయమే దొరకడం లేదని అన్నాడు. తనతో మాట్లాడుతున్న జెన్నిఫర్ ఆస్టన్ ఒక గైనకాలజిస్ట్ కూడా అవడంతో.. రామ్ చరణ్ కూడా ఆమెతో కన్వర్సేషన్లో బాగా ఇన్వాల్వ్ అయ్యాడు.
జెన్నిఫర్‌తో రామ్ చరణ్ మాట్లాడుతూ.. తన భార్య ఉపాసన కూడా అమెరికాకు రానుందని అన్నాడు. మిమ్మల్ని ఇలా కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు. మీ నెంబర్ తీసుకుంటానని చెబుతూ పరోక్షంగా ఆమెను తన భార్యతో సహా వచ్చి కలుస్తాను అనే హింట్ ఇచ్చాడు. రామ్ చరణ్ మాటలకు జెన్నిఫర్ ఆస్టన్ కూడా నవ్వుతూ స్పందిస్తూ.. నీ భార్య ఉపాసనకు కాన్పు చేయడం తనకు ఆనందమే అని బదులిచ్చింది. ఇక ఇదే విషయంపై చరణ్ మాట్లాడుతూ.. తాను తండ్రి కాబోతున్నాను అని తెలిసి ఇంట్లో అందరం సెలబ్రేట్ చేసుకున్నాకా.. మొదటగా ఆ విషయాన్ని తాను తన మిత్రుడు తారక్‌తోనే పంచుకున్నాను అని అన్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీ కోస్టార్ తారక్ గురించి, తారక్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి చెబుతూ రామ్ చరణ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆ సినిమా యూనిట్‌కి భారీ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ని అందివ్వడమే కాదు.. ప్రపంచ వేదికలపైకి సైతం చేరుకునేలా చేసింది. అలా వచ్చిన ఫేమ్తోనే రామ్ చరణ్‌కి గుడ్ మార్నింగ్ అమెరికాకు ఆహ్వానం అందింది. ఇప్పటికే నాటు నాటు పాటకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న మూవీ యూనిట్.. ఆ తరువాత లాస్ ఏంజెల్స్‌లో జరిగిన మరో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిలిం కేటగిరిలో క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్ అందుకుంది. ఇక ఇప్పుడు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డ్స్ బరిలోనూ నిలిచింది.
ఇవన్నీ ఒక ఎత్తయితే.. పేరొందిన హాలీవుడ్ దిగ్గజాలు ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి ప్రతిభను చూసి పొగడ్తల్లో ముంచెత్తడం వారికి దక్కిన మరో గౌరవం. ఇవన్నీ ఇలా ఉండగానే తాజాగా రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా షోకు అతిథిగా వెళ్లడం కచ్చితంగా టాలీవుడ్ స్థాయిని పెంచే పరిణామాలుగానే భావించవచ్చు అనే టాక్ బలంగా వినిపిస్తోంది. మొత్తానికి టాలీవుడ్ సినీ పరిశ్రమ ప్రపంచం ముంగిట తలెత్తుకుని నిలిచేలా ఆర్ఆర్ఆర్ సినిమాను మలిచిన జక్కన్నకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
ఇది కూడా చదవండి : SRK Follows 6 People: షారుఖ్ ఖాన్ ఫాలో అవుతున్న ఆ ఆరుగురు ఎవరో తెలుసా ?
ఇది కూడా చదవండి : RRR Rajamouli Steven Spielberg of India: రాజమౌళి ఇండియన్ స్టీవెన్ స్పీల్ బర్గ్.. చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఇది కూడా చదవండి : RRR Movie: హాలీవుడ్ దిగ్గజాలు టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్లతో.. ఆర్ఆర్ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ పోటీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook