Wild dog movie review: వైల్డ్ డాగ్ మూవీ రివ్యూ, రేటింగ్

Wild dog movie review in Telugu: కొత్త దర్శకులతో ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే కింగ్ నాగార్జున మరోసారి అహిషోర్ సాల్మన్ అనే రైటర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘వైల్డ్ డాగ్’ సినిమా చేశాడు. టెర్రరిస్ట్‌లను పట్టుకునే పవర్‌ఫుల్ NIA officer క్యారెక్టర్‌లో నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ మూవీ ఈరోజే రిలీజైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా ? నాగ్‌కి ఎలాంటి విజయం అందించిందనే వివరాలు ఈ రివ్యూలో చూద్దాం.

Last Updated : Apr 2, 2021, 05:47 PM IST
  • నాగార్జునను పవర్‌ఫుల్ పాత్రలో చూపించిన Wild dog movie.
  • వైల్డ్ డాగ్ మూవీపై అంచనాలు పెంచిన Wild dog trailer.
  • అంచనాలకు తగినట్టుగా వైల్డ్ డాగ్ మూవీ ఉందా ? కొత్త దర్శకుడు Ahishor Soloman సినిమాను ఎలా తెరకెక్కించాడో ఈ రివ్యూలో చూద్దాం.
Wild dog movie review: వైల్డ్ డాగ్ మూవీ రివ్యూ, రేటింగ్

నటీనటులు : నాగార్జున, దియా మీర్జా, సయామీ ఖేర్, అలీ, ప్రకాష్, అతుల్ కులకర్ణి, అనిష్ కురువిల్లా తదితరులు.
సినిమాటోగ్రఫీ: షానీల్ డియో
డైలాగ్స్: కిరణ్ కుమార్
సహ నిర్మాతలు : ఎన్.ఎం. పాషా, జగన్మోహన్ వంచ
నిర్మాతలు : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
రచన-దర్శకత్వం : అహిషోర్ సోలొమాన్
సెన్సార్ : U/A
నిడివి : 129 నిమిషాలు
విడుదల తేది : 2 ఏప్రిల్ 2021

Wild dog movie review in Telugu: కొత్త దర్శకులతో ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే కింగ్ నాగార్జున మరోసారి అహిషోర్ సాల్మన్ అనే రైటర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘వైల్డ్ డాగ్’ సినిమా చేశాడు. టెర్రరిస్ట్‌లను పట్టుకునే పవర్‌ఫుల్ NIA officer క్యారెక్టర్‌లో నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ మూవీ ఈరోజే రిలీజైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా ? నాగ్‌కి ఎలాంటి విజయం అందించిందనే వివరాలు ఈ రివ్యూలో చూద్దాం. 

కథ : 
పూణేలోని జాన్ బేకరీలో ఓ భారీ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. టెర్రరిస్ట్‌లు అమర్చిన బాంబు పేలి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు. ఆ సమయంలో బాంబ్ బ్లాస్ట్ చేసిన ఉగ్రవాదులను పట్టుకునే పవర్‌ఫుల్ ఆఫీసర్ కోసం చూస్తున్న ఇండియా గవర్న్‌మెంట్‌కి అంతకు ముందు ఇలాంటి కేసులను డీల్ చేసిన NIA ఆఫీసర్ వైల్డ్ డాగ్ అలియాస్ విజయ్ వర్మ (Nagarjuna Akkineni) బెస్ట్ చాయిస్‌గా కనిపిస్తాడు. దాంతో డెస్క్ జాబ్ చేస్తూ సాధారణ లైఫ్ లీడ్ చేస్తున్న విజయ్ వర్మకి ఈ బాంబ్ బ్లాస్ట్ కేసు అప్పగించి సీక్రెట్ మిషన్ ద్వారా ఉగ్రవాదులను పట్టుకొని అప్పగించాలని అతనిపై అధికారి (అతుల్ కులకర్ణి) ద్వారా భాద్యతను అప్పగిస్తారు.
పై అధికారి ఆర్డర్‌తో బరిలోకి దిగిన వైల్డ్ డాగ్ పూణేలో భారీ బ్లాస్ట్ చేసి మిగతా చోట్ల కూడా ప్లాన్ చేసే ఉగ్రవాదులను ఎలా హతమార్చాడు ? చివరికి ఈ బ్లాస్ట్‌ల వెనుక ఉన్న ఖలీద్ అనే ఉగ్రవాదిని విజయ్ వర్మ అండ్ టీం నేపాల్ నుండి ఇండియాకి ఎలా తీసుకొచ్చారు ? అనేదే మిగతా కథ.

నటీనటుల పనితీరు : 
పవర్‌ఫుల్ NIA ఆఫీసర్ పాత్రకి నాగార్జున ది బెస్ట్ ఇచ్చాడు. నాగ్ తన కెరీర్‌లో పోషించిన అద్భుతమైన పాత్రల్లో విజయ్ వర్మ కూడా ఒకటని చెప్పుకునేలా ఉంటుంది. విజయ్ వర్మ భార్య ప్రియా పాత్రలో దియా మీర్జా (Actress Dia Mirza) ఆకట్టుకుంది. కాకపోతే ఆమెకి సినిమాలో చాలా తక్కువ సన్నివేశాలు ఉన్నాయి. కథలో కీ రోల్ పోషించే ఆర్య పండిత్ క్యారెక్టర్‌లో సయామీ ఖేర్ మంచి నటన కనబరిచింది. ఉగ్రవాది ఖలీద్ పాత్రలో నటించిన నటుడు క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. వైల్డ్ డాగ్ టీంలో మంచి రోల్స్ దక్కడంతో అలీ, ప్రకాష్ తదితరులు ఆకట్టుకొని నటులుగా రుజువుచేసుకున్నారు. అతుల్ కులకర్ణి, అనిష్ కురువిల్లా తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

Also read: Happy Birthday Ajay Devgn: పుట్టినరోజు సందర్భంగా అజయ్ దేవగణ్‌కు ఆర్ఆర్ఆర్ సర్‌ప్రైజ్
సాంకేతిక వర్గం పనితీరు :
సినిమాకు థమన్ నేపథ్య సంగీతం బ్యాక్ బోన్‌గా నిలిచింది. షానీల్ డియో అందించిన విజువల్స్ బాగున్నాయి. కొన్ని సన్నివేశాల్లో అతని కెమెరా పనితనం కనిపించింది. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ బాగుంది. సినిమాను సాగదీయకుండా కథకి పర్ఫెక్ట్ అనిపించేలా తక్కువ నిడివితో సినిమాను ఎడిట్ చేయడం కొంత వరకు ప్లస్ అయ్యింది. కొన్ని సన్నివేశాల్లో మురళి ఆర్ట్ వర్క్ కూడా బాగుంది.

Wild dog movie review and rating in Telugu

అహిషోర్ సోలొమాన్ రాసుకున్న కథ -కథనం రొటీన్‌గా ఉన్నప్పటికీ.. దర్శకుడిగా మంచి మార్కులే అందుకున్నాడు. మ్యాట్నీ ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

కొన్నేళ్ళుగా వంశీ పైడిపల్లి దగ్గర రైటర్‌గా పనిచేస్తున్న అహిషోర్ సాల్మన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగార్జున సినిమా చేస్తున్నాడనే వార్త బయటికొచ్చినప్పటి నుండి ‘వైల్డ్ డాగ్’ సినిమాపై పాజిటీవ్ బజ్ కనిపించింది. ఇటీవల రిలీజైన వైల్డ్ డాగ్ మూవీ ట్రైలర్ (Wild dog movie trailer) సినిమాపై మరికొన్ని అంచనాలు పెంచింది.  అయితే దర్శకుడు సోల్మాన్ ఈ సినిమాతో పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. దర్శకుడు ఎంచుకున్న కథతో పాటు కథనంలో కొత్తదనం కనిపించలేదు. ఇదివరకే ఇలాంటి కాన్సెప్ట్స్‌తో సినిమాలు వచ్చేయడంతో ‘వైల్డ్ డాగ్’ రొటీన్ యాక్షన్ డ్రామా అనిపిస్తుంది. పైగా ఈ టైప్ కథలతో OTT లో సిరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక సన్నివేశాలకు బలం చేకూర్చే సరైన డైలాగులు లేకపోవడం కూడా మైనస్.

Also read : Vakeel Saab benefit shows: వకీల్ సాబ్ మూవీ బెనిఫిట్ షోలు ఉన్నట్టా లేనట్టా ?

ఈ టైప్ కథల్లో ప్రేక్షకుడు ఊహించలేని ట్విస్టులు ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే టికెట్టు కొన్న ఆడియన్ థ్రిల్ అవుతాడు. ఈ సినిమా విషయంలో దర్శకుడు చేసిన  మిస్టేక్ ఏదైనా ఉందా అంటే అదే అనిపించింది. వైల్డ్ డాగ్ టీం డిఫరెంట్ థీమ్‌తో ట్విస్టులు రాసుకునుంటే ఇంకా బాగుండేది. క్లైమాక్స్‌లో అలాంటి ట్విస్టు ఒకటి ఉన్నా అది కూడా వావ్ అనిపించేలా లేదు. ఇంటర్వెల్‌కి ముందు విలన్ ఎస్కేప్ అయ్యే సీన్, రెండోభాగంలో వచ్చే నేపాల్ సన్నివేశాలు, క్లైమాక్స్‌లో ఉగ్రవాదిని పట్టుకొని ఇండియాకి తీసుకొచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అయితే రెండో భాగంలో విలన్ మళ్ళీ ఎస్కేప్ సన్నివేశం అంత ఆసక్తిగా అనిపించదు. అండర్ కవర్ ఆపరేషన్, ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు ఇంకా ఆసక్తిగా ఉంటే బాగుండేది. నటీనటుల నుండి దర్శకుడు అహిషోర్ సాల్మన్ (Ahishor Soloman) బెస్ట్ తీసుకున్నాడు. అలాగే కొన్ని సన్నివేశాలను అనుభవం ఉన్న దర్శకుడిలా తెరకెక్కించాడు.

ఇండియాలో కొన్ని బాంబు బ్లాస్ట్‌లకి కారణమైన ఓ ఉగ్రవాదిని పట్టుకుని ఇండియా తీసుకొచ్చే ఓ  NIA ఆఫీసర్ కథ అనగానే ప్రేక్షకులు కొన్ని థ్రిల్లింగ్ ట్విస్టులు, సీన్స్ ఊహించుకొని థియేటర్స్‌లోకి అడుగు పెడతారు. అయితే అలా ఎక్కువ ఊహించి సినిమాకొచ్చిన వారిని ‘వైల్డ్ డాగ్’ కొంత వరకు నిరుత్సాహపరుస్తుంది. మిగతా వారికి మాత్రం పరవాలేదనిపిస్తుంది. ఓవరాల్‌గా టెర్రరిజం నేపథ్యంతో నాగార్జునను (Nagarjuna) వచ్చిన ఈ యాక్షన్ డ్రామాను ఓసారి చూడొచ్చు.

Also read : Nagarjuna Latest Look: టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని వైల్డ్ డాగ్ లుక్ స్టిల్స్ వైరల్ 
ప్లస్ పాయింట్స్ :
నాగార్జున
తమన్ నేపథ్య సంగీతం
సినిమాటోగ్రఫీ
కొన్ని సన్నివేశాలు
ప్రీ క్లైమాక్స్ – క్లైమాక్స్ 

మైనస్ పాయింట్స్ 
స్టోరీ
ఫ్లాట్ స్క్రీన్‌ప్లే
ట్విస్టులు లేకపోవడం
 
రేటింగ్ : 2.75/5

జీ సినిమాలు సౌజన్యంతో...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News