Yatra 2 Movie Collections: 2024 జనరల్ ఎలక్షన్స్‌కు కొన్ని రోజులు టైమ్ మాత్రమే ఉంది. ఎలక్షన్స్‌లో గెలుపే లక్ష్యంగా వై.యస్.జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఎవరి ఎత్తులు వారు వేస్తున్నారు. అందుకోసం సినిమాలను ఓ ఆయుధులుగా వాడుకుంటున్నారు. ఈ కోవలో 'యాత్ర 2' అంటూ వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా ముఖ్యమంత్రి కావడానికి వై.యస్.జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర నేపథ్యంలో 'యాత్ర 2' మూవీ తెరకెక్కింది. ఇందులో తెలుగు ఆర్టిస్టులు లీడ్ రోల్స్‌లో కాకుండా తమిళ, మలయాళ నటులు నటించారు. తెలుగు వాళ్లు ఎవరైనా నటిస్తే.. వారికి సినీ రంగంలో భవిష్యత్తు ఉండదనే కారణంతో పెద్ద నటులు ఎవరు ఈ సినిమాలో యాక్ట్ చేసే సాహసం చేయలేకపోయారు. యాత్ర2లో మమ్ముట్టి .. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటిస్తే.. తమిళ నటుడు జీవా వై.యస్.జగన్మోహన్ రెడ్డి పాత్రలో యాక్ట్ చేసారు.
ఈ నెల 8న విడుదలైన ఈ సినిమాకు మంచి అప్లాజ్ వచ్చింది. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత హై కమాండ్ నుంచి పాదయాత్ర చేయకూడదంటూ ఆదేశాలు. వాటిని ధిక్కరించి పాదయాత్ర చేసి పొలిటికల్ లీడర్‌గా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎలా ఎదిగాడు. ముందుగా ప్రతిపక్ష నేత.. ఆ తర్వాత ముఖ్యమంత్రి కావడానికి తండ్రిలా పాద యాత్ర ఎలా ఉపయోగపడిందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఆర్టిస్టుల రెమ్యునరేషన్‌తో పాటు మొత్తంగా రూ. 50 కోట్లు ఖర్చు అయింది. కానీ ఈ సినిమా వైసీపీకి అనుకూలంగా తెరకెక్కడం.. ఓ వర్గం ప్రేక్షకులకు నచ్చేలా సినిమా ఉండటం.. అవతలి వాళ్లను విలన్స్‌గా చూపెట్టం వంటి ఈ సినిమాకు మైనస్‌గా మారాయి. అప్పట్లో ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలకు ప్రేక్షకులు ఎలా తిరస్కరించారో.. తాజాగా 'యాత్ర 2' మూవీని ఆడియన్స్ అసలు పట్టించుకోలేదనే చెప్పాలి.
పూర్తిగా జగన్మోహన్ రెడ్డి యాంగిల్లో తెరకెక్కించిన ఈ సినిమాలో కొన్ని నిజాలు.. మరికొన్ని సినిమాటిక్ కల్పితాలున్నాయనేది ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ సినిమా విడుదల రోజున చేసిన హడావుడి ఆ తర్వాత పూర్తిగా చల్లబడింది. ఈ సినిమా పూర్తిగా సీరియస్‌గా సాగడం.. కమర్షియల్ అంశాలకు దూరంగా కాస్త డ్రామాటిక్‌గా తెరకెక్కిన ఈ సినిమా మొదటి వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.85 కోట్ల షేర్ (రూ. 5.75 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.45 కోట్ల షేర్ (రూ. 7.10 కోట్ల గ్రాస్) వసూళ్లనే రాబట్టింది. ఈ సినిమాకు మమ్ముట్టి, జీవా స్టార్డమ్ పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఓన్ రిలీజ్ చేసుకున్నారు. రూ. 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం ఫస్ట్ వీక్‌లోనే చాప చుట్టేసింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిందనే చెప్పాలి. ఓవరాల్‌గా థియేట్రికల్‌గా మరో రూ. 7 కోట్లు రాబట్టాలి. ఇపుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా ఆ రేంజ్ వసూళ్లను రాబట్టడం కష్టమే అని చెప్పాలి. ఓవరాల్‌గా టాక్ బాగున్నా.. సినిమా పూర్తిగా వన్ సైడ్‌గా ఉండటం వంటివి యాత్ర 2కు ప్రతికూలంగా మారాయి. ఈ సినిమాలో నటించిన మమ్ముట్టికి పారితోషకం కింద రూ. 20 కోట్లు.. జీవాకు రూ. 10 కోట్లు.. మిగతా నటీనటులకు కలిపి రూ. 5 కోట్లు దాకా ఖర్చు అయిందనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా రూ. 50 కోట్లకు వచ్చిన చిల్లర రూ. 3.45 కోట్లు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ సినిమా ఏదైనా డబ్బులు వస్తే గిస్తే.. డిజిటల్, శాటిలైట్ రూపేణా రావాల్సిందే. ఏది ఏమైనా ఎంతో అట్టహాసంగా ఎన్నికల అస్త్రంగా మలిచిన ఈ సినిమా థియేట్రికల్‌గా ఫెయిల్ అయినా.. ఓటీటీ వేదికగా ఎలాంటి సంచలనం రేపుతుందనేది చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook