Zee Real Heroes Awards 2024: అంతాక్షరి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న అనూ కపూర్

Zee Real Heroes Awards 2024:  జీ రియల్ హిరోస్ అవార్డ్స్ 2024లో అనూ కపూర్ అవార్డు స్వీకరించడంతో, తన 'అంతాక్షరి' ప్రయాణం గురించి మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు.  జి రియల్ హీరోస్ అవార్డుల ప్రోగ్రాం రంగ రంగ వైభవంగా ముంబైలో జరిగింది. ఈ అవార్డుల ఫంక్షన్ కి ఎంతోమంది సెలబ్రిటీస్ హాజరయ్యారు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jan 15, 2025, 08:05 PM IST
Zee Real Heroes Awards 2024: అంతాక్షరి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న అనూ కపూర్

Annu Kapoor: జీ రియల్ హిరోస్ అవార్డ్స్ 2024 జనవరి 4న ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రెటీస్ తో పాటు.. రాజకీయ నాయకులకు కూడా హాజరయ్యారు.  ఈ కార్యక్రమంలో అనేక రంగాల్లో ప్రతిభ చూపించిన వ్యక్తులను గౌరవించారు. బాలీవుడ్ నటుడు, ప్రసిద్ధ టెలివిజన్ వ్యాఖ్యాత అనూ కపూర్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక గౌరవాన్ని అందుకున్నారు.  

అనూ కపూర్ మాట్లాడుతూ, తన కెరీర్‌లోని మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. 1993లో జీ ఛానల్ ప్రోమో షూట్ కోసం తనను ఆహ్వానించిన సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల షూట్ వాయిదా పడింది అని చెప్పుకొచ్చాడు. కాగా ఆగస్టు 6, 1993న, అనూకు వచ్చిన ఒక ఫోన్ కాల్ అతని జీవితాన్ని మార్చింది. బిజేంద్ర సింగ్ ద్వారా వచ్చిన ఆ అవకాశంతో, 'అంతాక్షరి' షోకి వ్యాఖ్యాతగా పనిచేయాల్సిందిగా ఆహ్వానించారు.  కాగా ఇదే విషయాన్ని తెలియజేశారు అనుకపూర్.

“అదే రోజు షూటింగ్ మొదలైంది. ఆ రోజు నాకు చెప్పిన మాట ఇప్పటికీ గుర్తుంది—ఇంకెప్పుడూ వెనక్కి చూడాల్సిన అవసరం ఉండదని," అని అనూ చెప్పుకొచ్చారు. 'అంతాక్షరి' షో ఆయన జీవితాన్ని మార్చడమే కాకుండా.. టెలివిజన్ చరిత్రలో చిరస్థాయిగా మిగిలింది.  ఈ విషయాలన్నీ మరోసారి గుర్తు చేసుకుంటూ ఆనందానికి గురయ్యారు అను. 

ఇక రియల్ హీరోస్ అవార్డు ఫంక్షన్ కి వస్తే..ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయానికి, పట్టుదలకే ఈ అవార్డ్స్ అంకితం చేశారు.

Read more:  Harsha Richhariya: కుంభమేళలో సందడి చేస్తున్న గ్లామరస్ సాధ్వీ.. హర్ష రిచారియా ఎవరో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News