ముంబై: దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో మూతపడిన మద్యం విక్రయాలు తిరిగి ప్రారంభం కానున్నాయని మహారాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం ఓ ప్రకటన ద్వారా తెలిపింది. అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కరోనా వ్యాప్తి కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోన్నఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఇళ్ల నుండి అత్యవసర వస్తువుల కోసం మాత్రమే వస్తున్నారు.
Also read : Coronavirus పుట్టుకపై అమెరికా ఇంటెలీజెన్స్ కీలక ప్రకటన
లాక్ ప్రకటించిన నాటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆదాయం పూర్తిగా పడిపోవడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం అమ్మకాలను తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నాయి. ఈ తరుణంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ముందడుగు వేశారు. అయితే మద్యం దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు ఖచ్చితత్వంగా అమలు చేయాలని, నియమాలు యథాతథంగా ఉంటాయని పేర్కొంది. మహారాష్ట్రలో కరోనా తీవ్రత అధికంగా ఉండటం కేసుల తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. ఇప్పటివరకు పది వేల కేసులు నమోదు కాగా 432 మంది దీని బారిన పడి మరణించారు. దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ను మే 17వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..