Movie News: కలల ప్రపంచం నుంచి కళారంగం వరకు.. సినిమాటోగ్రాఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి ఇంట్రెస్టింగ్ జర్నీ

Cinematographer Kushendar Ramesh Reddy: కలల ప్రపంచం నుంచి మూవీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి.. సినిమాటోగ్రాఫర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కుశేందర్ రమేష్ రెడ్డి. ఆయన ఫిల్మ్ జర్నీపై ఓ లుక్కేయండి.

Written by - Ashok Krindinti | Last Updated : Jan 30, 2025, 04:56 PM IST
Movie News: కలల ప్రపంచం నుంచి కళారంగం వరకు.. సినిమాటోగ్రాఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి ఇంట్రెస్టింగ్ జర్నీ

Cinematographer Kushendar Ramesh Reddy: ఒక మనిషి ఆలోచనతో మొదలై ఎన్నో అద్భుతాలును సృష్టించేదే సినిమా. మహాసముద్రం లాంటి ఈ సినీ ప్రపంచంలో వైవిధ్యమయిన కథ కథనాలతో ప్రేక్షకుల మనసును మెప్పించడానికి దర్శకుల ప్రతిభతో పాటు ప్రతి సన్నివేషాన్ని కథకు అనుగుణంగా ప్రేక్షకుల మనసును ఆకట్టుకునేలా  చిత్రీకరించటంలో సినిమాటోగ్రఫర్ పాత్ర చాల ప్రధానమైనది. ప్రతి సన్నివేశాన్ని సగటు ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయేలా తనకంటూ ఉన్న శైలితో నవతరాన్ని ఆకట్టుకుంటున్న నేటితరం సినిమాటోగ్రఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి.

హైదరాబాద్ లో పుట్టిపెరిగిన మన తెలుగోడే ఈ కుశేందర్ రమేష్ రెడ్డి. చిన్నతనం నుంచే  ఫోటోగ్రఫీ పట్ల గొప్ప ఆసక్తి కలిగిన కుశేందర్ ఇప్పుడు బారీ సినిమాలకు డిఓపి గా  పని చేస్తూ అటు ప్రేక్షకుల  ఇటు విశ్లేషకుల మన్ననలు పొందుతున్నారు. స్కూల్ డేస్ నుండి తనకి ఫోటోగ్రఫీ పైన ఆసక్తి !ఒక కెమెరా కొనుక్కునేలా చేసింది, తన కెమెరాలో బంధించిన ఫోటోలకు  పలువురి  ప్రశంసలు కురిపించేలా  చేసింది. ఆ ఆసక్తితో చిన్న కెమెరా పట్టుకున్న చేతులు  ఇష్టంతో పెద్ద కెమెరా పట్టుకునే స్థాయికి వెళ్లి ఫోటోగ్రఫీ తన ప్రొఫెషన్ గా మార్చుకున్నారు. BFA [photography] graduation కంప్లీట్ చేసి KK SENTHIL KUMAR దగ్గర 'ఈగ' ,'బాహుబలి 1','బాహుబలి 2'  అలాగే 'RRR' కి  చీఫ్ అసోసియేట్ గా  పనిచేస్తూ  అంచెలంచెలుగా  తన ప్రావీణ్యాన్ని పెంచుకుంటూ సెకండ్ కెమెరాకి ఆపరేటర్‌గా కూడా పనిచేసే స్థాయికి ఎదిగి భారీ సినిమాల నిర్మాణంలో భాగమయ్యారు. 

ఆ తర్వాత ఇండిపెండెంట్ గా ఒక భారీ  టీవీ సిరీస్ తో పాటు ఆడ్ ఫిలిమ్స్ కూడా చేశారు. 2022 లో కీరవాణి కొడుకు శ్రీ సింహ కోడూరి హీరోగా నటించిన 'బాగ్ సాలే' మూవీతో తన కెరీర్ ని మొదలుపెట్టి ,రీసెంట్ గ వచ్చిన 'మా ఊరి పొలిమేర 2' తో గొప్ప విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. 

చరిత్ర చీకటిలో కప్పబడిన ఒక కన్నీటి గాధని 'రజాకార్' సినిమా గా మలిచిన దర్శకుడు యాటా గారి ఆలోచనని  దృశ్యకావ్యంగా  మలిచే క్రమంలో ప్రతి సన్నివేశం మన కళ్ళముందే జరుగుతున్నట్టుగా, అప్పటి చరిత్ర ప్రేక్షకుడి మనసుకు హత్తుకునేలా తన సినిమాటోగ్రఫీతో అందరి కళ్ళు చెమర్చేలా తన  విజువల్స్ మాట్లాడుతున్నాయని ప్రేక్షకులు చెప్పుకునే స్థాయికి  ఎదిగారు. 

ప్రస్తుతం  గ్లిమ్ప్స్ మరియు టీజర్ తో   మంచి బజ్ అందుకున్న వానర సెల్యూలాయిడ్ , డైరెక్టర్ మారుతి సమర్పణలో మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో వస్తున్న 'బార్బరిక్' చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. అలాగే పొలిమేర దర్శకుడు అనిల్ విశ్వనాధ్ కథ కథనంతో నాని దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా పొలిమేర ఫెమ్  కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా SSS ప్రొడక్షన్ హౌస్ చిట్టూరి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రానికి ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తారతమ్యం లేకుండా కంటెంట్ ఉన్న కథలని ఎంచుకుని   తనదైన ప్రత్యేక శైలితో దర్శకుల ఆలోచలనలకి దృశ్యరూపం అందించాలని, తనదైన మార్క్ ని క్రియేట్ చేసుకోవాలని ఉందని మీడియాతో  చెప్పుకొచ్చారు  సినిమాటోగ్రఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి .

Trending News