1998లో నల్లజింకలను వేటాడి హతమార్చిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ని టాలీవుడ్ రచయిత, దర్శకుడు కోన వెంకట్ వెనకేసుకొచ్చారు. "సల్మాన్ కేసులో కోర్టువారు ఇచ్చిన తీర్పుతో నేను షాక్ అయ్యాను. ఈ సందర్భంగా ఆ నటుడి వ్యక్తిత్వం గురించి మాట్లాడడం సబబు కాదు. అనేక దేశాల్లో పర్యావరణ సమతుల్యత కోసం జంతువేటను ప్రభుత్వాలు సమర్థిస్తున్నాయి. ముందుగా మనం మానవులను కాపాడుకుంటే మంచిది" అని కోన వెంకట్ ట్విటర్లో పోస్టు చేశారు.
‘ఐ సపోర్ట్ సల్మాన్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో ఆయన ఆ పోస్టు చేశారు. అయితే సల్మాన్ పై కోన వెంకట్ చేసిన ట్వీట్‌కు నెగటివ్ రెస్పాన్స్ కూడా నెటిజన్స్ నుండి వచ్చింది. చాలామంది కోన వెంకట్ చేసిన ట్వీట్ పై మండిపడ్డారు. ఒక దోషిని ఎలా వెనకేసుకొస్తారంటూ ప్రశ్నించారు
ఈ క్రమంలో తన ట్వీట్ పై వస్తున్న ప్రతికూల స్పందనలకు కూడా కోన వెంకట్ రిప్లై ఇచ్చారు. "నేను సల్మాన్‌ని సపోర్టు చేయడం చాలామందికి బాధ కలిగించవచ్చు. కాని నా బాధంతా సల్మాన్ భాయ్ గురించే. పాములు, తేళ్లు, వివిధ రకాల జంతువులతో పాటు మనుషులను చంపడానికి కూడా నేను వ్యతిరేకమే. నేను మానవత్వానికి మాత్రమే మద్దతుగా నిలవాలని భావిస్తాను. నన్ను దయ చేసి అర్థం చేసుకోండి" అని కోన వెంకట్ తెలిపారు.
I’m shocked at the verdict on @BeingSalmanKhan ... let’s not debate on his character... in many countries governments allow hunting animals to maintain the ecological balance... let’s save humans first .. #Isupportsalman
— kona venkat (@konavenkat99) April 5, 2018
I know that many of u are hurt with my support to @BeingSalmanKhan on the case .... but I’m more concerned about Salman Bhai.. I definitely don’t support killing any animal including snakes or scorpions... animals or humans, let’s support humanity .. I hope u understand 🙏
— kona venkat (@konavenkat99) April 5, 2018