Jabardasth ట్విస్ట్: దొరబాబు, పరదేశీ అలా బుక్కయ్యారా!

సెక్స్ రాకెట్‌లో అడ్డంగా దొరికిపోయిన జబర్దస్ట్ ఆర్టిస్టులు దొరబాబు, పరదేశీల కేసులో మరో ఆసక్తికర విషయం వెలుగుచూసింది. అసలు ఆరోజు పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేసేందుకు వెళ్లలేదట. బెట్టింగ్ పేకాట ఆడుతున్నారని సమాచారం అందుకున్న విశాఖపట్నం మాధవదార పోలీసులు మంగళవారం (మార్చి 3న) అక్కడికి వెళ్లారు. తనిఖీలు చేసిన పోలీసులు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసే యత్నం చేయగా.. అందులో ఓ యువకుడు ఈ గుట్టు విప్పాడు.

See Pics: మొన్న పింక్ బికినీలో.. నేడు బ్లాక్ బికినీ..

తామని అరెస్ట్ చేస్తున్నారు కానీ, పక్క ఫ్లాట్‌లో జబర్దస్త్ కమెడియన్లు దొరబాబు, పరదేశీలు ఉన్నారని, వారు అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. పేకాటరాయుళ్లు చెప్పింది నిజమా కాదా తెలుసుకునేందుకు పక్క ఫ్లాట్‌కు వెళ్లి తనిఖీ చేసిన పోలీసులు షాకయ్యారు. నిజంగానే అక్కడ కొందరు విటులు, ఓ మహిళ ఉన్నట్లు గుర్తించారు. జబర్దస్త్ ఆర్టిస్టులు దొరబాబు, పరదేశీలు కనిపించడంతో పోలీసులు అవాక్కయ్యారు. మొత్తంగా ఓ మహిళతో పాటు నలుగురు విటుల్ని అదుపులోకి తీసుకున్నారు.

నేను వ్యభిచారం చేయలేదు.. ప్లీజ్ ఆపేయండి: నటుడు ఆవేదన

ఇక అది మొదలుకుని జబర్దస్త్ కమెడియన్లు సెక్స్ రాకెట్‌లో అడ్డంగా బుక్కయ్యారని, వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. హైపర్ ఆది టీమ్‌లో దొరబాబు కీలక సభ్యుడు, పరదేశీ సైతం అదే టీమ్‌లో స్కిట్లు చేసేవాడని తెలిసిందే. పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో తమను విడిచిపెట్టాలంటూ పరదేశీ పోలీసుల కాళ్లుపట్టుకుంటున్న వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. 

Also Read: సెక్స్ రాకెట్ కేసులో ఇద్దరు జబర్దస్త్ నటులు అరెస్ట్

తమను విడిచిపెట్టాలని పోలీసులకు చెప్పాలంటూ జబర్దస్త్ జడ్జి, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ఫోన్ కాల్ చేసి దొరబాబు సాయం కోరగా.. అందుకు ఆమె నిరాకరించినట్లు ప్రచారం జరుగుతోంది. సమాచారం. కాగా, తాజా పరిణామాలతో తనకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని భావించిన హైపర్ ఆది ఆ ఇద్దరిని తన టీమ్ నుంచి తీసేశారంటూ కథనాలు వస్తున్నాయి.

See Pics: టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వక ముందే మోడల్ రచ్చ రచ్చ 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

English Title: 
Twist on Jabardasth artists Dorababu and Paradesi arrested in Vizag sex racket case
News Source: 
Home Title: 

‘జబర్దస్త్‌’ ట్విస్ట్: దొరబాబు, పరదేశీ అలా బుక్కయ్యారా!

Jabardasth ట్విస్ట్: దొరబాబు, పరదేశీ అలా బుక్కయ్యారా!
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Jabardasth ట్విస్ట్: దొరబాబు, పరదేశీ అలా బుక్కయ్యారా!
Publish Later: 
No
Publish At: 
Monday, March 9, 2020 - 07:20
Created By: 
Shankar Dukanam
Updated By: 
Shankar Dukanam
Published By: 
Shankar Dukanam