Colorectal Cancer: శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా..ఇంకా భయపెడుతున్న వ్యాధి కేన్సర్. ఇప్పుడు కొలెరెక్టల్ కేన్సర్ చికిత్సలో కొత్త ఔషధం ఆశలు రేపుతోంది.
ప్రపంచవ్యాప్తంగా కేన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోంది. వివిధ రకాల కేన్సర్లు ముప్పుగా మారుతూ..సవాలు విసురుతున్నాయి. ఇందులో ఒకటి కొలెరెక్టల్ కేన్సర్. అంటే ప్రేవుల కేన్సర్. 50 ఏళ్లు దాటిన తరువాత పురుషులు, మహిళల్లో ఎక్కువగా కన్పిస్తుంటుంది. ఇప్పుడు ఓ కొత్త ఔషధం ఈ కేన్సర్ రోగులకు ఆశాకిరణంగా కన్పిస్తోంది.
యూరోపియన్ సొసైటీ ఆఫ్ ఆంకాలజీ భేటీలో ఇటీవల మూడు అధ్యయనాలు సమర్పించారు పరిశోధకులు. ఈ అధ్యయనాల ప్రకారం మెటాస్టాటిక్ కొలెరెక్టల్ ట్యూమర్ అంటే ప్రేవుల కేన్సర్ చికిత్స కోసం మూడు రకాల మందులు సురక్షితంగా, ఎఫెక్టివ్‌గా తేలాయి. ఈ మందులు మూడు రకాల కొలెరెక్టల్ కేన్సర్ కారకమైన మ్యూటేషన్‌పై అద్భుతంగా పని చేస్తున్నాయి.
మహిళలు, పురుషుల్లో ప్రేవుల కేన్సర్ సాధారణంగా మారింది. ఈ కేన్సర్ 50 కంటే ఎక్కువ వయస్సు కలిగివారిలో కన్పిస్తోంది. అయితే ఇటీవల గత కొద్దికాలంగా తక్కువ వయస్సువారిలో కూడా ఈ కేన్సర్ లక్షణాలు కన్పిస్తున్నాయి. దీనికి కారణం పర్యావరణ కాలుష్యం కావచ్చని అంచనా. మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి, మైక్రోబయోటిక్ ఇంటెస్టైనల్ కారణంగా తెలుస్తోంది.
ఈ కేన్సర్‌లో 50 ఏళ్ల వయస్సు నుంచి సరైన పరీక్షలు, కేన్సర్ ప్రారంభంలో గుర్తించి చికిత్స తీసుకుంటే జీవించే శాతం 91 శాతం ఉంటుంది. అయితే కేన్సర్ నిర్ధారణ ఆలస్యమైతే శరీరమంతా వ్యాపించి జీవించే పరిస్థితి 17 శాతానికి పడిపోతుంది.
గత కొద్దికాలంగా మెటాస్టాటిక్ కొలెరెక్టల్ కేన్సర్‌పై చికిత్స కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ అధ్యయనం బీఆర్ఏఎఫ్ వి 600 ఇ మ్యూటేషన్ ట్యూమర్ ఆధారితం. ప్రేవుల కేన్సర్ పీడిత రోగుల్లో 10-12 శాతం మంది ఈ వేరియంట్‌కు ప్రభావితమౌతారు. ఇది కూడా ఓ రకమైన ట్యూమర్ లాంటిదే. సరైన సమయంలో గుర్తించకపోతే మొత్తం విస్తరించి ప్రాణాంతకమౌతుంది.
2019లో జరిపిన ఓ అధ్యయనం ద్వారా రెండు ఆంకోజీన్ బీఆర్ఏఎఫ్ , ఈజీఎఫ్ఆర్ కారణంగా కేన్సర్ రోగుల్లో ఈ కొత్త ఔషధం అద్భుతంగా పనిచేసిందని తేలింది. అందుకే ఈ కొత్త మందుని కొలెరెక్టల్ కేన్సర్ సెకండ్, ధర్డ్ దశల్లో చికిత్సకు ఉపయోగిస్తున్నారు. చాలా దేశాల్లో కీమోథెరపీ స్థానంలో ఈ మందును వాడుతున్నారు.
Also read: Drink For Diabetes: మధుమేహం ఉన్నవారు ఈ డ్రింక్ తాగితే చాలు.. కేవలం 3 రోజుల్లో చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook