AstraZeneca Corona vaccine: భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టగా, ఇటీవల బ్రిటన్‌లో కొత్త వేరియంట్ గుబులు రేపుతోంది. ఈ నేపథ్యంలో యూకే ప్రజలకు ఓ శుభవార్త. ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా లేదా ఫైజర్ వ్యాక్సిన్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిలో భారత్‌లో తొలిసారిగా గుర్తించిన B1.617.2 కోవిడ్19 వేరియంట్‌పై 80 శాతానికి పైగా ప్రభావం చూపుతుందని గుర్తించారు.
దాదాపు 50 దేశాలలో B1.617.2 లేదా డెల్టా వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. దీని వల్ల భారత్‌లో కరోనా వేగంగా వ్యాప్తి చెందిందని తెలిసిందే. యూకేలోని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. AstraZeneca Corona Vaccine లేదా ఫైజర్ గానీ రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే ఇంగ్లాండ్‌లోని కెంట్ ప్రాంతంలో గుర్తించిన B.117 వేరియంట్‌పై 87 శాతం ప్రభావం చూపుతున్నాయని తేలింది. యూకేలో అత్యంత వేగంగా కరోనా వ్యాప్తి చేస్తున్న వేరియంట్‌పై సైతం వ్యాక్సిన్ ప్రభావం చూపుతుందని తెలియడంలో దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: India Corona Cases Updates: దేశంలో భారీగా తగ్గుతున్న కరోనా కేసులు, Covid-19 మరణాలు
B1.617.2 variant ద్వారా ఇటీవల 2,111 కరోనా కేసులు నమోదు కాగా, గత వారం ఈ సంఖ్య 3,424కు పెరిగినట్లు పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ గుర్తించిందని ద టెలీగ్రాఫ్ న్యూస్ పేపర్ కథనం ప్రచురించింది. ప్రతివారం ఈ కేసులలో పెరుగుదల కనిపిస్తుందని సాంగ్నర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ఆఫ్ కోవిడ్19 జెనోమిక్స్ డాక్టర్ జెఫ్రీ బారెట్ ఈ విషయాన్ని బీబీసీకి వెల్లడించారు. ప్రస్తుతం 20 నుంచి 30 శాతంగా ఉన్న కేసులు త్వరలో 50 శాతానికి పెరిగే అవకాశాలున్నాయని, కెంట్ వేరియంట్‌తో పోల్చితే కోవిడ్19 డేల్టా వేరియంట్ మరింత ప్రమాదకరమని పేర్కొన్నారు.
Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే పిల్లలు పుట్టరా, కేంద్ర ఆరోగ్యశాఖ క్లారిటీ
కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో యార్క్‌షైర్ సహా ఇతర ఇంగ్లాండ్ ప్రాంతాలలో 32 మరియు 33 ఏళ్ల వారికి సైతం కరోనా వ్యాక్సిన్ బుకింగ్స్ ప్రారంభించాలని నేషనల్ హెల్త్ సర్వీస్ నిపుణులు సూచించారు. ఇటీవల 34 మరియు 35 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ప్రారంభించామని, త్వరలోనే 30 ఏళ్ల నుంచి 33 వయసు వారికి వ్యాక్సిన్లు అందించే దిశగా ఇంగ్లాండ్ చర్యలు చేపట్టింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడం ద్వారా మాత్రమే కరోనాకు చెక్ పెట్టవచ్చునని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook