Ghee Benefits in Telugu: నెయ్యి ప్రేమికులు మన దేశంలో చాలామంది ఉన్నారు. భోజనంలో భాగంగా నెయ్యిని తింటారు. అదేవిధంగా వంటకాల్లో నెయ్యిని ఉపయోగిస్తారు. ఒక రెసిపీని తయారుచేసేటప్పుడు ఏదైనా ఆహారంలో నెయ్యిని యాడ్ చేస్తే ఆ వంటకం టేస్ట్ వేరే లెవల్‌లో ఉంటుంది. రుచితోపాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే చాలా మంది నెయ్యి తింటే బరువు పెరుగుతామని అనుకుంటారు. కానీ రోజుకు ఓ టీ స్పూన్ నెయ్యి తింటే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. నెయ్యి గురించి మీకు తెలియని అనేక ప్రయోజనాలు ఇలా..
మలబద్ధకంతో ఇబ్బంది పడుతుంటే.. అది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. మీ జీర్ణక్రియ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. ఫలితంగా హేమోరాయిడ్స్, మల రక్తస్రావం, ఆసన పగులు (పాయువు చుట్టూ ఉన్న చర్మంలో కన్నీరు), రెక్టల్ ప్రోలాప్స్ (మలద్వారంలో కొంత భాగం పాయువు నుంచి బయటకు వచ్చే పరిస్థితి) ఇలా చాలా సమస్యలు వస్తాయి. మలబద్ధకం నుంచి ఉపశమనం పొందాలంటే.. రోజుకు ఒకటి లేదా రెండు టీ స్పూన్ల నెయ్యి తీసుకోవాలి. పడుకునే ముందు ఒక కప్పు వేడి పాలలో నెయ్యి కలుపుకోని తాగాలి.
చలికాలంలో నెయ్యి తింటే.. శరీరంలో వేడిని పెంచుతుంది. చలి నుంచి తట్టుకునేలా చేస్తుంది. చపాతీలో నెయ్యి వేసుకుని తింటే.. అందులోనేఇ గ్లైసెమిక్ ఇండెక్స్‌ను కొద్దిగా తగ్గిస్తుందని చాలా మంది పోషకాహార నిపుణులు అంటున్నారు. దీంతో నెయ్యి సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
జలుబు చేసినప్పుడు ముక్కు మూసుకుని పోయి.. చాలా మంది ఇబ్బంది పడతారు. ఆ టైమ్‌లో ఏం చేయాలన్నా దిక్కుతోచదు. మెడిసిన్స్ వాడితే జలుబు తగ్గినా.. ముక్కు రంధ్రాలు మాత్రం ఓపెన్ అవ్వవు. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జలుబుకు న్యాస చికిత్స అని పిలుస్తారు. కొన్ని చుక్కల స్వచ్ఛమైన ఆవు నెయ్యిని నాసికా రంధ్రాలలో (ఉదయం) పోయడం వల్ల మీ ముక్కు రంధ్రాలు తెరుచుకుంటాయి. అంతేకాకుండా ఇది గొంతు ఇన్ఫెక్షన్లను కూడా నయం చేస్తుంది. నెయ్యి గోరువెచ్చగా వేడి చేసుకోని పోసుకోవాలి.
నెయ్యిలో మీడియం-చైన్ ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉన్నందున చాలా శక్తిని అందిస్తుంది. అవి కాలేయంలో కలిసిపోయి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. నెయ్యి తీసుకోవడం వల్ల మీ చర్మానికి తేమ అందుతుంది. తద్వారా ముఖానికి మెరుపు వస్తుంది. అదేవిధంగా ఇది జుట్టును మెరిసేలా.. మృదువుగా ఉంచుతుంది.
Also Read: Komatireddy Rajagopal Reddy: బీజేపీకి బిగ్ షాక్..కాంగ్రెస్‌లోకి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి!
Also Read: Sunitha Laxma Reddy: ఉత్కంఠకు తెర.. నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook