Anti Ageing Foods: మీ డైట్ ఇలా మార్చుకుంటే ఏజియింగ్‌కు చెక్, మీ వయస్సు పదేళ్లు వెనక్కి

Anti Ageing Foods: వయస్సుతో పాటు వృద్ధాప్య లక్షణాలు రావడం సహజం. కానీ ఇటీవలి కాలంలో నిర్ణీత వయస్సుకు ముందే ఆ ఛాయలు వచ్చేస్తున్నాయి. వాస్తవానికి సరైన కొన్ని పద్ధతులు పాటిస్తే వయస్సుతో సంబంధం లేకుండా వృద్ధాప్యాన్ని దరిచేరకుండా చేయవచ్చు. ఆ వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 10, 2024, 05:48 PM IST
Anti Ageing Foods: మీ డైట్ ఇలా మార్చుకుంటే ఏజియింగ్‌కు చెక్, మీ వయస్సు పదేళ్లు వెనక్కి

Anti Ageing Foods: ప్రతి ఒక్కరికీ వయస్సుతో పాటు వృద్ధాప్య లక్షణాలు కన్పిస్తాయి. దీనినే ఏజీయింగ్ అంటారు. ఎవరికైనా సరే వృద్ధాప్య లక్షణాలు ముందుగా కన్పించేది ముఖంపై. మీ ముఖంపై కూడా ముడతలు పడటం, లేదా చర్మం వదులుగా ఉండటం గమనిస్తే వృద్ధాప్య లక్షణాలేనని అర్ధం. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని చిట్కాలతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

వయస్సు పెరిగే కొద్దీ వచ్చే వృద్ధాప్య లక్షణాలు ముందుగా ముఖంపై కన్పిస్తాయి. ముకంపై చారలు, ముడతలు, చర్మం వదులుగా ఉండటం కన్పిస్తుంది. మీకు కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవండి. ఖరీదైన క్రీమ్స్, కాస్మోటిక్స్ కాకుండా చాలా సులభమైన పద్ధతులతో ఏజీయింగ్ సమస్యకు చెక్ చెప్పవచ్చు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో కొన్ని కీలక మార్పులు చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై యౌవనం వస్తుంది. బాడీ కూడా ఫిట్‌గా ఉంటుంది. వయస్సు ప్రభావం కన్పించనివ్వని యాంటీ ఏజీయింగ్ ఫుడ్స్ గురించి తెలుసుకుదాం. ఇవి క్రమం తప్పకుండా తీసుకుంటే మీ వయస్సు ఏకంగా పదేళ్లు వెనక్కి వెళ్లిపోతుంది. 

డ్రై ఫ్రూట్స్ ఇందులో ప్రధానమైన ఫుడ్. రోజూ బాదం, వాల్‌నట్స్, పిస్తా వంటివి తీసుకోవాలి. దీనివల్ల చర్మ సంరక్షణతో పాటు ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో హెల్టీ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రట్ స్థితిలో ఉంచుతాయి. చర్మం డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. ఇక రెండవది డార్క్ చాకోలేట్స్. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. డార్క్ చాకోలేట్స్ తినడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఇందులో కోకోవా, ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. రక్త సరఫర  మెరుగుపడుతుంది. దాంతో చర్మం ఎప్పటికీ యౌవనంగా ఉంటుంది. 

ఇక మూడవ ముఖ్యమైన ఫుడ్ గ్రీన్ టీ. వాస్తవానికి ఇదే కీలకమైంది. ఇందులో ఉండే కైటెసీన్ అనే యాంటీ ఆక్సిడెంట్..చర్మంపై సూర్యరశ్మి చేసే హానిని నియంత్రిస్తుంది. ఫలితంగా చర్మం ఎలాస్టిసిటీ మెరుగ్గా ఉంటుంది. చర్మం అందంగా నిగనిగలాడుతుంది. దీనికోసం రోజుకు కనీసం రెండు కప్పులు గ్రీన్ టీ తాగాలి. ఇక నాలుగోది చిలకడ దుంపలు. ఇందులో ఉండే బీటా కెరోటిన్ కారణంగా శరీరానికి కావల్సినంత విటమిన్ ఎ లభిస్తుంది. చర్మాన్ని మృదువుగా మార్చుతుంది. ముడతల్ని తగ్గిస్తుంది. 

ఆకు కూరలు చాలా కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా పాలకూర, అరటి, తోటకూర, వంటివి తప్పకుండా డైట్‌లో ఉండాలి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కే ఎక్కువగా ఉంటాయి. ఇవి డెడ్ సెల్స్ మరమ్మత్తుకు, కొలాజెన్ ఉత్పత్తి, స్కిన్ టోన్‌కు ఉపయోగపడతాయి. టొమాటో కూడా బెస్ట్ యాంటీ ఏజీయింగ్ ఫుడ్ కేటగరీలో వస్తుంది. ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది. కొలాజెన్ ఉత్పత్తి చేస్తుంది. ముఖంపై రెడ్ నెస్ తగ్గిస్తుంది. చర్మం టెక్స్చర్ మెరుగుపడుతుంది. 

Also read: High BP Signs: ఈ 4 లక్షణాలు కన్పిస్తే తస్మాత్ జాగ్రత్త, బీపీ ప్రమాదంలో ఉన్నట్టే

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News