Best And Quickest Way To Lose Belly Fat And Lose Weight: ప్రస్తుతం బరువు పెరగడం అనేది సాధరణ సమస్యగా మారింది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ బరువు పెరుగుతున్నారు. అలాగే దీని కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన కూడా పడుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా శరీర బరువుతో పాటు కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రించుకోవాల్సి ఉంటుంది. సులభంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? మీ కోసం ఓ ప్రత్యేకమైన డ్రింక్‌ను తీసుకువచ్చాం. ఈ డ్రింక్‌తో సులభంగా బరువు తగ్గడమే కాకుండా బెల్లీ ఫ్యాట్ కూడా కరుగుతుంది.
బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు కలబందతో తయారు చేసిన కొన్ని డ్రింక్స్ తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీరానికి తగిన పోషకాలను అందించి, బాడీని డిటాక్సిఫైయింగ్ చేసేందుకు కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది. ఈ డ్రింక్‌ను ప్రతి రోజు తాగాలనుకునేవారు తప్పకుండా వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుంది. అయితే బరువు తగ్గడానికి కలబందను ఎలా వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నిమ్మ రసం, కలబంద:
కలబందను నిమ్మరసంతో కలిపి ప్రతి రోజు తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి శరీరంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా బాడీలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా సహాయపడుతుంది.
వేడి నీటితో కలబంద:
బరువు తగ్గాలనుకునేవారు ఉదయాన్నే ఖాళీ పొట్టతో గోరువెచ్చని నీటిలో కలబంద మిశ్రమాన్ని మిక్స్ చేసుకుని తాగడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు బెల్లీ ఫ్యాట్ కూడా సులభంగా తగ్గుతుంది.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
తినే ముందు ఇలా తీసుకోండి:
అలోవెరా మిశ్రమాన్ని ఆహరం తీసుకునే 20 నిమిషాల ముందు ఒక చెంచా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందతారు. ఇలా ప్రతి రోజు తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడడమే కాకుండా సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు పొట్టను ఆరోగ్యంగా ఉంచి కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter