Brinjal Facts: వంకాయల రహస్య ప్రయోజనాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Brinjal Facts: వంకాయలను క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా విముక్తి కలిగిస్తాయి. అయితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Sep 5, 2024, 03:51 PM IST
Brinjal Facts: వంకాయల రహస్య ప్రయోజనాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు!

 

Brinjal Facts In Telugu: వంకాయ కర్రీ అంటే ఇష్టపడనివారుండరు. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. భారతీయులు వంకాయలను వివిధ రకాల రెసిపీల్లో తయారు చేస్తారు. నిజానికి ప్రతి వారంలో ఒక్కసారైనా వంకాయను తినడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు గుండె సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు కొలెస్త్రాల్‌ను నియంత్రించేందుకు కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే వంకాయను క్రమం తప్పకుండా తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 

హృదయ ఆరోగ్యానికి మేలు:
వంకాయలో ఫైబర్, పొటాషియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణాల్లో లభిస్తాయి. ఇవి రక్తపోటుతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీంతో పాటు గుండె సమస్యలను నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

బరువు నియంత్రణ: 
వంకాయలో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ అధిక మోతాదులో లభిస్తుంది. ఇది ఆకలిని నియంత్రించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా బరువు తగ్గడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

మధుమేహాన్ని నియంత్రించడం: 
వంకాయలోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

క్యాన్సర్ సమస్యలకు చెక్: 
వంకాయలోని యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ కలిపిస్తుంది. అంతేకాకుండా కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

జీర్ణ వ్యవస్థకు మేలు: 
వంకాయలోని ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని కారణంగా సులభంగా మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇవే కాకుండా అనేక రకాల పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయి.

చర్మ ఆరోగ్యం: 
వంకాయలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని అన్ని సమస్యల నుంచి రక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ముడతలు రాకుండా కూడా చర్మాన్ని అందంగా చేస్తుంది. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News