రెడ్ మీట్..
క్యాన్సర్ బారిన పడేలా చేసే ప్రధాన ఆహారం రెడ్ మీట్. ఇందులో ముఖ్యంగా పోర్క్, బీఫ్ ఇవన్నీ మీలో కొలక్టరల్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్, ప్రోస్టేట్ క్యాన్సర్ పెరుగుదలకు కారణమవుతుంది. ఇవి సైలెంట్‌గా మీలో క్యాన్సర్ ను అభివృద్ధి చేస్తాయి.వీటిని ఉడికించే విధానం ఎక్కువ టెంపరేచర్లో ఉంటుంది. కాబట్టి ఇది క్యాన్సర్ బారిన పడేలా చేస్తుంది. దీంతో మీరు ప్రాణాంతక జబ్బుల బారిన పడక తప్పదు.
చక్కెర డ్రింక్స్..
క్యాన్సర్ బారిన పడేలా చేసే మరో డ్రింక్. ఈ షుగర్ డ్రింక్స్ ముఖ్యంగా సోడా, చక్కర ఉండే జ్యూసులు ఇందులో ఒబేసిటీ ఇన్సూలిన్ నిరోధకత కూడా కారణం అవుతుంది. అంతేకాదు కొన్ని రకాల క్యాన్సర్లకు కూడా ఈ షుగర్ డ్రింక్స్ కారణమవుతాయి. ముఖ్యంగా బ్రెస్,ట్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఎక్కువగా ఈ షుగర్ ఉన్న డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ సమస్యలను ప్రేరేపించి ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెంచుతుంది. ఇలాంటి డ్రింక్స్ కి బదులుగా కొన్ని హెర్బల్ టీ, నీళ్లు సహజసిద్ధమైన పండ్ల రసాలు తీసుకోవాలి. ఇందులో చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి.
రీఫైండ్ కార్బోహైడ్రేట్స్..
హైడ్రేట్స్ అంటే ముఖ్యంగా కొన్ని రకాల చక్కెర ఉన్న పేస్ట్రీలు, బ్రెడ్ ఇవన్నీ బరువు పెరిగేలా చేస్తాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరిగిపోతాయి. ఇది కాకుండా మిమ్మల్ని క్యాన్సర్ బారిన పడేలా చేస్తుంది. బ్రెస్ట్, కొలెక్టరల్ క్యాన్సర్ కి కారణం అవుతుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతపై ఎఫెక్ట్, ఇన్ఫ్లమేషన్ సమస్యలు పెంచుతుంది. వీటికి బదులుగా బ్రౌన్ రైస్, గోధుమతో చేసిన బ్రెడ్, క్వినోవా వంటివి డైట్లో చేర్చుకోవడం వల్ల ఇందులో ఫైబర్ ఉంటుంది, ఖనిజాలు అందుతాయి.
ఆర్టిఫిషియల్ స్వీటేనర్స్..
ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అంటే సుక్రోలోజ్ వంటివి తరచుగా తీసుకోవడం వల్ల ఇవి అనారోగ్యం బారిన పడేలా చేస్తాయని కొన్ని నివేదికలు తెలిపాయి .వీటిని మితిమీరి తీసుకోకుండా ఉండాలి.. లేకపోతే ఇది క్యాన్సర్ అభివృద్ధికి కారణమవుతుంది. వీటికి బదులుగా తేనె, మ్యాపులు సిరప్ వంటివి తీసుకోవడం వల్ల సమతుల ఆహారం అవుతుంది.
సోడియం ఫుడ్స్..
ఎక్కువ మోతాదులో ఉండే సోడియం ఫుడ్స్ ముఖ్యంగా క్యాన్డ్ సూప్స్, ఉప్పు అధికంగా ఉండే స్నాక్స్ ప్యాకెట్ ఫుడ్స్ కూడా ఎక్కువ బీపీకి పెరిగేలా చేస్తుంది. ఇది కిడ్నీ డ్యామేజ్ కి కారణం అవుతుంది. ఎక్కువ రోజులు పాటు ఇలా సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల కడుపు క్యాన్సర్ బారిన కూడా పడతారు. వీటికి బదులుగా కొన్ని రకాల తక్కువ సోడియం ఉండే ఆహారాలు తీసుకోవాలి.
Read Also: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్స్ బస్సు బోల్తా, నలుగురి మృతి..
ఆల్కహాల్..
ఆల్కహాల్ కూడా క్యాన్సర్ అభివృద్ధి చెందే ప్రమాదం ఉంది ముఖ్యంగా బ్రెస్ట్, లివర్ క్యాన్సర్ బారిన పడతారు. ఇందులో ఈథనల్ ఉంటుంది ఇది క్యాన్సర్ బారిన పడేలా చేస్తుంది. ఎక్కువ మోతాదులో కాకుండా కేన్సర్ బారిన పడకుండా ఆల్కహాల్ తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోవడం వల్ల త్వరగా క్యాన్సర్ బారిన పడతారు.
ప్రాసెస్డ్ ఫుడ్స్..
అంటే ప్యాకేజీ లో ఉండే ఫుడ్ అనారోగ్య కరమైన కొవ్వులు ఉంటాయి. ఇందులో ఎక్కువ మోతాదులో చక్కర ఉంటుంది.. వీటిని తరచుగా డైట్లో చేర్చుకోవడం వల్ల ఒబెసిటీ, ఇన్ఫ్లమేషన్ సమస్య కూడా వస్తుంది. రాను రాను క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి కారణం అవుతుంది. ఇలాంటి ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. ముఖ్యంగా మీ డైట్ లో పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. లీన్ ప్రోటీన్, తృణధాన్యాలు ఉండేలా చూసుకోండి.
Read Also: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈనెల 20 నుంచి మళ్లీ పాత పద్ధతిలోనే దర్శనాలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.