Colocasia Leaves Can Control Diabetes Acidity Weight Loss In 6 Days : చేమ దుంపను ఆయుర్వేద శాస్త్రంలో గొప్ప మూలికగా పరిగణిస్తారు. ఇందులొ ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చేమ దుంపే కాకుండా ఆకులు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఆకులలో విటమిన్లు A, B, C, కాల్షియం, పొటాషియం, యాంటీ-ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల తీవ్ర వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చేమ దుంప ఆకుల ప్రయోజనాలు:
రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
చేమ దుంప ఆకుల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు అధికంగా లభిస్తాయయి. కాబట్టి వీటి ఆకులను ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇందులో శరీరానికి అవసరమైన విటమిన్ సి 80 శాతం లభిస్తుంది. ఈ ఆకులను ప్రతి రోజు తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
Also read: AP Schools Summer Holidays: వేసవి సెలవులు పొడగించండి.. సీఎం జగన్‌కు టీడీపీ రిక్వెస్ట్
ఎసిడిటీ సమస్యలు కూడా దూరమవుతాయి:
చేమ దుంప ఆకులను ప్రతి రోజు తినడం వల్ల పొట్ట సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఆకులను నీటిలో ఉడికించి..నీటిని ఖాళీ కడుపుతో తాగడం ఎసిడిటీ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
మధుమేహం సమస్యలు దూరమవుతాయి:
ప్రస్తుతం చాలా మంది మధుమేహాన్ని నియంత్రించుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో చాలా మంది రసాయనాలతో కూడిన ఔషధాలు వినియోగిస్తున్నారు. వీటికి బదులుగా చేమ దుంప ఆకులను తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
బరువు నియంత్రిస్తుంది:
శరీర బరువును తగ్గించడానికి చేమ దుంప ఆకులు ప్రభావంతంగా సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.
Also read: AP Schools Summer Holidays: వేసవి సెలవులు పొడగించండి.. సీఎం జగన్‌కు టీడీపీ రిక్వెస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook