Covid19: మీరు కరోనా బారిన పడ్డారా అయితే గుండె పోటు ముప్పు ఉన్నట్టే భయపెడుతున్న తాజా అధ్యయనం

Covid19 Study: కరోనా మహమ్మారి సమయంలో మీరు కోవిడ్ 19 బారిన పడ్డారా..అయితే గుండె పోటు ముప్పు మీకు ఉన్నట్టే. వ్యాక్సిన్ తీసుకోకుంటే ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది జాగ్రత్త. ఇదంతా ట్రాష్ అని తీసి పారేయవద్దు. అమెరికా పరిశోథనా సంస్థ చేసిన అధ్యయనం నివేదిక ఇది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 14, 2024, 07:46 PM IST
Covid19: మీరు కరోనా బారిన పడ్డారా అయితే గుండె పోటు ముప్పు ఉన్నట్టే భయపెడుతున్న తాజా అధ్యయనం

Covid19 Study: అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన ఆధ్యయనం ఇప్పుడు అందర్నీ భయపెడుతోంది. ఈ అధ్యయనం నివేదిక సంచలనంగా మారింది. కోవిడ్ 19 ఇన్‌ఫెక్షన్ ప్రభావం గుండెపోటు, స్ట్రోక్ మరణాలపై మూడేళ్లు ఉంటుందనేది ఈ తాజా పరిశోధన సారాంశం. కోవిడ్ 19 సమయంలో ఒకవేళ వ్యాక్సిన్ తీసుకోకపోయుంటే ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉండవచ్చు. ఈ అంశాలే ఇప్పుడు అందర్నీ భయపెడుతున్నాయి. 

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అనేది అమెరికాలో అతిపెద్ద వైద్య పరిశోధనా సంస్థ. కోవిడ్ 19 ఇన్‌ఫెక్షన్, మరణాలపై ఈ సంస్థ గతంలో చాలా పరిశోధనలు చేసింది. కానీ ఈ తాజా పరిశోధన మాత్రం ప్రత్యేకమైంది. కోవిడ్ 19 ఇన్‌ఫెక్షన్ ప్రభావం మూడేళ్లు కొనసాగుతుందని తేలడం ఇదే తొలిసారి. ముఖ్యంగా కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో కోవిడ్ 19 బారిన పడినవారిలో గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఎన్ఐహెచ్ పరిశోధన తేల్చింది. కోవిడ్ వైరస్ సోకని వ్యక్తులతో పోలిస్తే కోవిడ్ 19 బారిన పడినవారిలో గుండె జబ్బుల ప్రమాదం రెండింతలు ఎక్కువగా ఉన్నట్టు పరిశోధనలో తేలింది. అదే కోవిడ్ ఇన్‌ఫెక్షన్ తీవ్రంగా ఉన్నవారిలో ఈ ముప్పు 4 రెట్లు ఎక్కువ. 

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన పరిశోధన నివేదిక అర్టెరియో స్కెలెరోసిస్, థ్రాంబోసిస్ వాస్కులర్ బయాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది. కరోనా బారినపడిన వారిలో గుండె జబ్బుల్ని నివారించేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్ 19 సోకిన తరువాత ఏ, బీ లేదా ఏబీ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తకులకు గుండెపోటు లేదా స్ట్రోక్ అవకాశం రెండు రెట్లు ఎక్కువని తేలింది. ఓ బ్లడ్ గ్రూప్ వ్యక్తుల్లో ఈ ముప్పు తక్కువే ఉందట. 

కరోనా వ్యాధి సోకినవారిలో గుండె పోటు, స్ట్రోక్ ముప్పు మూడేళ్లు కొనసాగింది. కరోనా రోగుల్లో ఈ ముప్పు 2 రెట్లు ఉంటే, కరోనా తీవ్రంగా ఉన్నవారిలో 4 రెట్లు ఉంది. కేవలం గుండెపోటే కాకుండా టైప్ 2 డయాబెటిస్ ముప్పు కూడా పెరిగిందని తేలింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారినపడినవారి సంఖ్య దాదాపుగా వంద కోట్లు ఉంది. అంటే గుండెపోటు ముప్పు వంద కోట్లమందికి ఉన్నట్టే.

Also read: Cyclone Alert: తుపాను ప్రభావం, భారీ వర్షాలతో వణుకుతున్న నెల్లూరు, రెడ్ అలర్ట్ జారీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News