Weight Loss Foos, Eat these Egg recipes for Weight Loss: ప్రస్తుత రోజుల్లో చాలా మందికి బరువు తగ్గడం పెద్ద సమస్యగా మారింది. బరువు తగ్గేందుకు అందరూ ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. బరువు తగ్గించే ఆహారం తీసుకోవడం లేదా మీ ఆహారాన్ని పరిమితం చేయడం ఉత్తమ మార్గం కాదు. ఒకేసారి ఆహారాన్ని తగ్గించడం ఏమాత్రం ఆరోగ్యకరం కాదు. ఇక ప్రోటీన్ మరియు ఇతర ముఖ్యమైన పోషకాలు గుడ్లలో ఉంటాయి . హార్మోన్ల సమతుల్యత, కణాల పెరుగుదల మరియు బరువు తగ్గడంతో సహా శరీరంలోని అనేక విధులకు బాధ్యత వహించే ముఖ్యమైన మాక్రోన్యూట్రియెంట్ 'ప్రోటీన్'. ప్రోటీన్లు అనారోగ్యంను తగ్గిస్తుంది.
బరువు తగ్గించేందుకు మీ బెస్ట్ ఫ్రెండ్‌గా గుడ్లు (Weight Loss Diet) పనిచేస్తాయి. డాక్టర్లు కూడా లెగ్స్ తినమని పదేపదే చెవుతుంటారు. అందుకే గుడ్లను నిత్యం తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా బరువు తగ్గడం కూడా. అయితే కొందరికి ఉడికించిన గుడ్లు తినడం ఇష్టముండదు. ఉడికించిన గుడ్డును తినడం ఇష్టం లేకపోతే.. కొన్ని రెసిపీల ద్వారా కూడా లెగ్స్ తినవచ్చు. దాంతో మీరు సులువుగా బరువు తగ్గే (Weight Loss Tips) అవకాశం ఉంటుంది.
ఎగ్ భుర్జీ:
'ఎగ్ భుర్జీ' ఒక రుచికరమైన అల్పాహారం. దీనిని తయారుచేయడం చాలా సులభం. ఎగ్ భుర్జీ చేయడానికి ముందుగా పాన్‌లో 1 టీస్పూన్ నూనె వేడి చేయండి. నూనె వేడి అయ్యాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయను వేసి.. బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఆపై సన్నగా తరిగిన ఒక టొమాటో వేసి 2-3 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు గుడ్లను అందులో కొట్టి కలపాలి. అనంతరం అన్ని మసాలా దినుసులు (పసుపు, ఎర్ర కారం మరియు జీలకర్ర పొడి) వేసి బాగా కలపాలి. అన్ని వేసాక తక్కువ మంట మీద 3-4 నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి దింపేయాలి.
ఎగ్ పరాటా:
ఎగ్ పరాటా తయారుచేసేందుకు ముందుగా పిండిలో ఉప్పు వేసి మెత్తగా చేసి 10-15 నిమిషాలు ఉంచాలి. ఒక పెద్ద గిన్నెలో రెండు గుడ్లు కొట్టండి. ఇప్పుడు పిండితో గుండ్రని ఆకారంలో సన్నని పరాటాను తయారు చేయండి. బీట్ చేసిన గుడ్డు మిశ్రమాన్ని పరాటాకు ఇరువైపులా రాయండి. నాన్-స్టిక్ తవా లేదా గ్రిడిల్ మీద నూనె లేదా నెయ్యి వేడి చేయండి. పరాటాను గ్రిడిల్‌పై ఉంచి రెండు వైపులా బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. అంతే ఎగ్ పరాటా రెడీ అవుతుంది.
Also Read: Rare Albino Cobra Price: బాప్రే.. అల్బినో కోబ్రా.. ఈ పాము మీ దగ్గరుంటే మిలియన్ల డాలర్లు మీ సొంతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.