Kiwi Health Benefits: ముఖ్యంగా చలికాలంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చలికాలంలో రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అందుకే పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకోవల్సి ఉంటుంది. వీటిలో అతి ముఖ్యమైంది కివీ ఫ్రూట్.
కివీ ఫ్రూట్ ఆరోగ్యపరంగా చాలా చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా మెగ్నీషియం, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, విటమిన్ ఇతో పాటు ఫైబర్ కూడా కావల్సినంతగా లభిస్తుంది. డెంగ్యూ వంటి వ్యాధి బారిన పడితే కివీ తప్పకుండా తినాల్సి ఉంటుంది. కివీ తినడం వల్ల శరీరంలో ప్లేట్ లెట్ కౌంట్ పెరుగుతుంది. ప్లేట్‌లెట్ కౌంట్ పెరగడంతో పాటు చాలా ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. కివీ ఫ్రూట్ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
మెరుగైన జీర్ణ వ్యవస్థకు కివీ ఫ్రూట్ అత్యద్భుతంగా పనిచేస్తుంది. కివీలో ఫైబర్ పుష్కలంగా ఉండటమే ఇందుకు కారణం. రోజూ కివీ తినడం వల్ల శరీరం మెటబోలిజం వృద్ధి చెందుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు సంబంధిత వ్యాధుల్నించి ఉపశమనం పొందేందుకు కివీ మంచి ప్రత్యామ్నాయం.
చలికాలంలో సహజంగా తగ్గే ఇమ్యూనిటీని క్రమబద్ధీకరించేందుకు కివీ ఫ్రూట్ కీలకంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్, జింక్, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు శరీరానికి చాలా అవసరం. వీటి వల్ల శరీరం పటిష్టంగా మారుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కివీ తినడం వల్ల వ్యాధుల్నించి విముక్తి కలుగుతుంది.
కివీ ఫ్రూట్ క్రమం తప్పకుండా తినడం వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. ఇందులో పుష్కలంగా లభించే పొటాషియం ఇందుకు దోహదపడుతుంది. అందుకే రోజావారీ డైట్‌లో కివీ ఫ్రూట్స్ చేర్చితే ఆరోగ్యానికి చాలా మంచిది. గుండె సంబంధిత వ్యాధులు కూడా దూరమౌతాయి.
కివీ ఫ్రూట్స్ రోజూ తినడం వల్ల కంటి సంబంధిత వ్యాధులు చాలా వరకు నయమౌతాయి. ఇందులో ఉంటే విటమిన్ ఎ చాలా కీలకం. కంటి వెలుగు పెరిగేందుకు, కళ్లద్దాల వాడకం నివారించేందుకు కివీ ఫ్రూట్స్ దోహదపడతాయి. రోజూ ఉదయం వేళ కివీ ఫ్రూట్స్ తినడం మంచిది.
కివీ ఫ్రూట్స్ క్రమం తప్పకుండా తరచూ తినడం వల్ల నిద్రలేమి సమస్య కూడా పోతుంది. ఇందులో ఉండే సెరిటోనిన్ అనే కాంపౌండ్ ఇందుకు ఉపయోగపడుతుంది. నిద్రలేమి సమస్యతో తరచూ బాధపడేవాళ్లు డైట్‌లో కివీ ఫ్రూట్స్ చేర్చితే మంచిది.
Also read: Corona New Variant Jn.1: వెంటాడుతున్న కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1, 24 గంటల్లో ఎన్ని కేసులంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook