Raisins Health Benifits: ఎండుద్రాక్షతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఎండుద్రాక్షను తీసుకోవడం ద్వారా పలు వ్యాధులు మీ దరిచేరకుండా ఉంటాయి. ఇది మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల ఎండుద్రాక్షలు సులభంగా దొరుకుతున్నాయి. ఎండుద్రాక్ష శరీరానికి చేసే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
ఎండు ద్రాక్ష తయారీ :
ద్రాక్షను ఎండబెట్టడం ద్వారా ఎండుద్రాక్ష తయారు చేస్తారు. ఈ ప్రక్రియ సుమారు 3-4 వారాలు పడుతుంది. భారతదేశంలో దీన్నే కిస్మిస్, ఉల్లర్ ధరాక్షి మొదలైన పేర్లతో పిలుస్తారు. భారతదేశంలో ఇది నాసిక్, సాంగ్లీ, జల్నా, షోలాపూర్, సతారా, కర్ణాటకలలో ఎక్కువగా ఉత్పత్తి చేయబడుతుంది. ఎండుద్రాక్షతో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో 4 ప్రధానమైన వాటిని తెలుసుకుందాం..
1. ఎండుద్రాక్ష జీర్ణక్రియకు దోహదపడుతుంది
ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల లేదా సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. దానివల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటప్పుడు ఎండుద్రాక్ష తీసుకుంటే.. శరీరానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మలబద్దకంతో బాధపడేవారికి ఎండుద్రాక్ష మంచి ఫుడ్ అని చెప్పొచ్చు.
2. శరీర బరువును నియంత్రిస్తుంది
ఎండుద్రాక్షలో కేలరీలు ఉండవు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఎండుద్రాక్ష తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో సహజంగా లభించే చక్కెర శరీరానికి శక్తిని ఇస్తుంది. రోజుకు ఒకసారైనా ఎండుద్రాక్ష తీసుకుంటే శరీరానికి మంచి శక్తి వస్తుంది.
3. రక్తహీనతకు చెక్
రక్తహీనతతో బాధపడేవారు రోజూ ఎండుద్రాక్ష తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడుతారు. కొన్ని ఎండుద్రాక్షలను రాత్రిపూట నీళ్లలో నానబెట్టి.. ఉదయం పరగడుపున వాటిని తీసుకుంటే మంచిదని చెబుతారు.
4. ఎముకలు దృఢంగా ఉంటాయి
కొంతమందికి పాలు అంటే అస్సలు నచ్చదు. అలాంటివారు పాలకు బదులు ఎండుద్రాక్ష తీసుకుంటే శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుంది. రోజుకు 4-5 ఎండుద్రాక్షలను తినడం ద్వారా ఎముకలు ధృఢంగా అవుతాయి.
(గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. దీనిని స్వీకరించే ముందు, తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Hero Vijay Meet KCR: కేసీఆర్ తో తమిళ హీరో విజయ్ భేటీ.. బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook