Diabetes Care Tips: మధుమేహం అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ఇదొక స్లో పాయిజన్ లాంటిది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే తప్ప నియంత్రణ సాధ్యం కాదు. డయాబెటిస్ నియంత్రించేందుకు ప్రతిరోజూ ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆధునిక జీవనశైలిలో ఎదురౌతున్న ప్రమాదకర వ్యాధి డయాబెటిస్. సరైన చికిత్స లేనందున నియంత్రణ ఒక్కటే దీనికి పరిష్కారం. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో లేకుంటే పలు సమస్యలకు దారితీస్తుంది. మరి నియంత్రణ ఎలా..దీనికి సమాధానమే ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు. తద్వారా డయాబెటిస్ నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇందులో ముఖ్యమైంది ఆరోగ్యకరమైన డైట్, మంచి నిద్ర, బ్లడ్ షుగర్ చెకింగ్ వంటివి అలవాటు చేసుకోవాలి. మీ బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయాలంటే ఉదయం వేళ కొన్ని పనులు తప్పకుండా చేయాలి. డయాబెటిస్ నియంత్రణకు ఏం చేయాలో పరిశీలిద్దాం..
ఉదయం లేవగానే తప్పకుండా చేయాల్సిన 5 పనులు
ప్రతిరోజూ ఉదయాన్ని ఆరోగ్యకరంగా ప్రారంభించాలి. అంటే మీరు తినే బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడూ ఆరోగ్యకరమైందిగా ఉండాలి. ప్రతిరోజూ ఉదయం హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఉదయం వేళ డైట్ హెల్తీగా ఉంటే..రోజంతా బాగుంటుంది. ఈ జాగ్రత్త తప్పకుండా పాటించాలి.
నీళ్లు తాగడం, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. మీరు మధుమేహ వ్యాధిగ్రస్థులైతే..ప్రతిరోజూ ఉదయం నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఉదయం లేచినవెంటనే కనీసం ఒక గ్లాసు నీళ్లు తప్పకుండా తాగాలి. గోరువెచ్చని నీళ్లైతే మరీ మంచిది. ఈ అలవాటు మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా ప్రేవుల్ని శుభ్రం చేస్తుంది. రోజూ ఎక్కువ నీళ్లు తాగుతుంటే బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.
బ్లడ్ షుగర్ చెక్ అనేది చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు బ్లడ్ షుగర్ ఎంత ఉందనేది తెలుసుకుంటూ ఉండాలి. ఉదయం లేచినవెంటనే షుగర్ టెస్ట్ చేసుకోవడం మంచి అలవాటు. దీనివల్ల మీ బ్లడ్ షుగర్ స్థాయి ఎంత ఉందో తెలుసుకుని..తద్వారా అవసరమైతే చికిత్సకు అవకాశముంటుంది.
Also read: Kidney Disease Symptoms: కిడ్నీ వ్యాధుల్ని పసిగట్టే 10 ముఖ్యమైన లక్షణాలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook