Soda Side Effects: ఆహారపు అలవాట్లు, పానీయాల విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క అభిరుచి ఉంటుంది. కొన్ని ఆరోగ్యాన్ని కల్గిస్తే..మరికొన్ని అనర్ధాలకు దారి తీస్తుంది. సోడా తాగడం ఇందులో ఒకటి. సోడా తాగితే కలిగే దుష్పరిణామాలేంటో తెలుసుకుందాం..
మనం తినే ఆహార పదార్ధాలు, పానీయాలను బట్టి ఆరోగ్యం, అనారోగ్యం ఆధారపడి ఉంటాయి. చాలామందిలో సోడా తాగే అభిరుచి ఎక్కువగా ఉంటుంది. ఏ మాత్రం కొద్దిగా అసౌకర్యంగా ఉన్నా సరే..సోడా తాగుతుంటారు. ఇంకొంతమందైతే రోజూ తాగుతుంటారు. కొందరు రాత్రి భోజనం తరువాత సోడా తాగడం అలవాటు చేసుకుంటారు. అయితే ఇలా సోడా తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని చాలామందికి తెలియదు. రోజూ సోడా తాగడం వల్ల ఎముకలు బలహీనంగా మారతాయి. మీక్కూడా ఆ అలవాటుంటే వెంటనే మానేయడం మంచిది.
సోడాతో కలిగే దుష్పరిణామాలు
ఆస్తమా సమస్య ఉన్నవాళ్లు సోడాను పూర్తిగా దూరం పెట్టాలి. ఎందుకంటే సోడాలో ఉండే ప్రిజర్వేటివ్ సోడియం బెజోయిట్ అనేది ఆస్తమాను ట్రిగ్గర్ చేస్తుంది. రోజూ సోడా తాగే అలవాటున్నవారిలో ఎముకలు బలహీనంగా మారిపోతాయి. సోడాలో ఉండే ఫాస్పోరిక్ యాసిడ్ అనేది శరీరం నుంచి కాల్షియంను బయటకు పంపించేస్తుంది. అందుకే సోడా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదంటారు వైద్య నిపుణులు.
కేన్సర్ ముప్పు
కొంతమంది డైట్ సోడా తాగుతుంటారు. కానీ డైట్ సోడా కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇందులో ఉండే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ స్థూలకాయానికి దారితీస్తుంది. అంతేకాకుండా కేన్సర్ ముప్పును పెంచుతుంది. రోజూ సోడా తాగే అలవాటుండేవారిలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువౌతాయి.
Also read: Healthy Heart: మీ గుండె పదికాలాలు ఆగకుండా ఉండాలంటే..ఈ ఐదు పదార్ధాలు తింటే చాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook