ఆధునిక జీవనశైలిలో ప్రధానంగా కన్పిస్తున్న సమస్య కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అనేది దాదాపు అందరిలో ఉంటోంది. కొన్ని చిట్కాలతో ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది.
ప్రస్తుత బిజీ ప్రపంచంలో ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం అధికమౌతోంది. సమయానికి తినకపోవడం లేదా ఫాస్ట్‌ఫుడ్స్‌పై ఆధారపడటం వంటి కారణాలతో ఆరోగ్యం పాడవుతోంది. అందుకే ప్రతి ఇద్దరిలో ఒకరికి కొలెస్ట్రాల్ సమస్య ఉంటోంది. కొలెస్ట్రాల్ శరీరంలో మైనంలా ఉంటుంది. శరీరంలో విటమిన్ డి, హార్మోన్స్‌లు తయారుచేస్తుంది. కొలెస్ట్రాల్ అనేది మూడు రకాలుగా ఉంటుంది. ఎల్‌డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్. ఇది ఉంటే గుండెకు హాని కలుగుతుంది. శరీరంలో ఇతర సమస్యలు కూడా ఉంటాయి. కొలెస్ట్రాల్ నియంత్రించేందుకు ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. లైఫ్‌స్టైల్ సరి చేసుకోవాలి. అసలు కొలెస్ట్రాల్ ఎలా నియంత్రించాలనేది ఇప్పుడు పరిశీలిద్దాం..
కొలెస్ట్రాల్ తగ్గించే మార్గాలు
వెల్లుల్లి
వెల్లుల్లి ప్రతి వంటింట్లో సులభంగా లభించే పదార్ధం. ప్రతిరోజూ వెల్లుల్లి తీసుకుంటే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. దాంతోపాటు బ్లడ్ ప్రెషర్, రక్త సరఫరా, మధుమేహం అన్నీ నియంత్రణలో ఉంటాయి.
గ్రీన్ టీ
గ్రీన్ టీ అనేది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. గ్రీన్ టీ సేవించడం వల్ల బరువు తగ్గడమే కాకుండా..కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది. ఇందులో కెఫీన్ తక్కువగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో సాధ్యపడుతుంది.
డ్రై ఫ్రూట్స్
డ్రై ఫ్రూట్స్ శరీరంలో పోషక పదార్ధాల్ని అందిస్తాయి. ప్రతిరోజూ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి.
ఓట్స్
ఓట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రోజూ ఉదయం ఓట్స్ తీసుకుంటే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. ఎల్‌డీఎల్‌ను 5.3 శాతం వరకూ తగ్గిస్తుంది.
Also read: Asthma Care Tips: ఆస్తమా రోగులు ఈ పదార్ధాలు తింటే..మూల్యం చెల్లించుకోవల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook