Heart Attack Precautions: రోజూ డైట్‌లో ఈ చియా సీడ్స్ సేవిస్తే కోవిడ్ నుంచి గుండెపోటు వరకూ అన్నీ మాయం!

Heart Attack Precautions with Chia Seeds: ఆధునిక జీవన విధానంలో అనారోగ్యం పెద్ద సమస్యగా మారింది. ఆరోగ్యకరమైన జీవన విధానం లేకపోవడంతో వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ఆరోగ్యాన్ని సంరక్షించుకునే కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 12, 2023, 11:26 AM IST
Heart Attack Precautions: రోజూ డైట్‌లో ఈ చియా సీడ్స్ సేవిస్తే కోవిడ్ నుంచి గుండెపోటు వరకూ అన్నీ మాయం!

Check Heart Attack with Chia Seeds: ఇటీవలి కాలంలో హార్ట్ ఎటాక్ సమస్య సర్వ సాధారణమైపోయింది. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ గుండెపోటుకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. గుండెపోటు సమస్య నుంచి గట్టెక్కడమే కాకుండా ఇతర అనారోగ్య సమస్యల్ని దూరం చేసేందుకు చియా సీడ్స్ అద్భుతంగా పనిచేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే చియా సీడ్స్‌ను సూపర్ ఫుడ్‌‌గా పిలుస్తారు. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి కీలకమైన న్యూట్రియంట్లు ఉంటాయి. చియా సీడ్స్ ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేస్తాయి. 

చియా సీడ్స్ ప్రయోజనాలు

ఇమ్యూనిటీ పటిష్టం

కోవిడ్ 19 మహమ్మారి  ప్రారంభమైనప్పటి నుంచి అందరిలో రోగ నిరోధక శక్తి ఆవశ్యకత పెరిగింది. రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటే సంక్రమిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది. చియా సీడ్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా ఇమ్యూనిటీ పెంచేందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి.

బ్లడ్ ప్రెషర్ నియంత్రణ

చియా సీడ్స్‌లో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ పెద్దమొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో సోడియం నియంత్రించేందుకు దోహదపడతాయి. సబ్జా గింజలతో కూడా బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది. బీపీ రోగులు ప్రతిరోజూ చియా సీడ్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.

Also Read: Dehydration Signs: బాడీ డీ హైడ్రేట్ అవుతుంటే ఈ లక్షణాలతో గుర్తించవచ్చు

బరువు తగ్గించే సాధనం

చియా సీడ్స్‌లో పెద్దమొత్తంలో ఫైబర్ ఉంటుంది. దాంతో జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా ఎక్కువ సేపు ఆకలేయకుండా ఉంటుంది. క్రేవిటీ తగ్గడంతో నెమ్మది నెమ్మదిగా బరువు తగ్గుతారు. భోనం చేసేటప్పుడే చియా సీడ్స్ కూడా తినడం అలవాటు చేసుకుటే నడుము, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. 

స్వెల్లింగ్

చియా సీడ్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు యాంటీ ఇన్‌ప్లమేటరీ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. దాంతో శరీరంలో స్వెల్లింగ్ తగ్గించేందుకు దోహదపడతాయి. శరీరంలో ఇతర వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుంది. అందుకే చాలామంది చియా సీడ్స్ తరచూ తినమని చెబుతుంటారు. 

హార్ట్ ఎటాక్ ముప్పు

ఇటీవలి కాలంలో ఎక్కడ విన్నా హాట్ ఎటాక్ కేసులు పెరుగుతున్నాయి. చియా సీడ్స్ గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బ్లడ్ ప్రెష‌ర్‌ను సాధారణం చేస్తాయి. దాంతో హార్ట్ డిసీజ్ ముప్పు చాలావరకూ తగ్గుతుంది. గుండెవ్యాధిగ్రస్థులకు ఇది చాలా మంచి ఔషధంగా చెప్పవచ్చు.

బ్లడ్ ప్రెషర్ నియంత్రణ

చియా సీడ్స్‌లో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ పెద్దమొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో సోడియం నియంత్రించేందుకు దోహదపడతాయి. సబ్జా గింజలతో కూడా బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది. బీపీ రోగులు ప్రతిరోజూ చియా సీడ్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.

Also Read: Diabetes Control Tips: డయాబెటిస్ నియంత్రించాలంటే డిన్నర్ తరువాత ఈ పని తప్పకుండా చేయాల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News